తేజ్‌ ఐ లవ్‌ యూ: రివ్యూ
Spread the love

నటీనటులు: సాయిధరమ్ తేజ్ – అనుపమ పరమేశ్వరన్ – జయప్రకాష్ – అనీష్ కురువిల్లా – పృథ్వీ-వైవా హర్ష – పవిత్ర లోకేష్ తదితరులు

సంగీతం: గోపీసుందర్

ఛాయాగ్రహణం: ఐ.ఆండ్రూ

మాటలు: డార్లింగ్ స్వామి

నిర్మాత: కె.ఎస్.రామారావు

దర్శకత్వం: ఎ.కరుణాకరన్

కూర్పు: ఎస్‌.ఆర్‌.శేఖ‌ర్‌

క‌ళ‌: సాహి సురేశ్‌

ప్రేమ‌క‌థా చిత్రాలకి పెట్టింది పేరు క‌రుణాక‌ర‌న్‌. అందుకే ఆయ‌న్ని ల‌వ్ మెజీషియ‌న్ అంటుంటారు. `తొలిప్రేమ‌` నుంచి ఆయ‌నకి ఆ మార్క్ ఉంది. అయితే కొంత‌కాలంగా ఆయ‌న చిత్రాల్లో మేజిక్ క‌నిపించ‌డం లేదు. ఈ సారి మ‌ళ్లీ ప్రేమ‌క‌థ‌ని ఎంచుకొన్నాడు. ఎలాగైనా ఈ సారి హిట్ కొట్టాల‌నుకుంటున్న త‌రుణంలో ప్రేమ‌క‌థా చిత్రాల స్పెష‌లిస్ట్ క‌రుణాక‌ర‌న్‌తో జ‌త క‌ట్టాడు. నాలుగేళ్ల త‌ర్వాత క‌రుణాక‌ర‌న్ మరో ప్రేమ‌క‌థ‌ను సిద్ధం చేసుకున్నాడు. ఈ రోజే ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రమైనా తేజుకు ఆశించిన ఫలితాన్నిచ్చిందో లేదో చూద్దాం పదండి.

కథ:

తేజ్ (సాయిధరమ్ తేజ్) చిన్నతనంలోనే తల్లిదండ్రుల్ని కోల్పోయిన కుర్రాడు. అతను చేయని తప్పుకు ఏడేళ్ల పాటు జైలు శిక్ష కూడా అనుభవిస్తాడు తేజ్. తర్వాత అతడిని పెదనాన్న కుటుంబం ఆదరిస్తుంది. కానీ తేజ్ చేసిన ఓ పని వల్ల ఆ కుటుంబం కూడా అతడిని దూరం పెడుతుంది. అలా కాలేజీలో కొంత మంది స్నేహితుల‌తో క‌లిసి ఓ రాక్ బ్యాండ్‌ని ఏర్పాటు చేసుకుని ప్రాక్టీస్ చేస్తుంటాడు. అలాంటి స‌మ‌యంలోనే అత‌నికి నందిని (అనుప‌మ ప‌ర‌మేశ్వ‌రన్‌) ప‌రిచ‌య‌మ‌వుతుంది. అనుకోకుండా జ‌రిగిన అగ్రిమెంట్ కార‌ణంగా 15 రోజులు ఆమెకు అత‌ను బాయ్ ఫ్రెండ్‌గా న‌టించ‌డానికి సిద్ధ‌మ‌వుతాడు తేజ్.

విశ్లేషణ:

మొదటి సారి చూస్తే కొత్తగా అనిపించే ఏ విషయమైనా.. మళ్లీ మళ్లీ చూస్తే మొహం మొత్తుతుంది. ఎ.కరుణాకరన్ తీసిన ‘తొలి ప్రేమ’.. ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’.. ‘డార్లింగ్’ లాంటి సినిమాల్లో అప్పటికి కొత్తగా.. మనసుకు హత్తుకునేలా కనిపించిన చాలా అంశాలు ఇప్పుడు.. ‘తేజ్ ఐ లవ్యూ’లో చూస్తుంటే చాలా అసహనాన్ని కలిగిస్తాయి. అందుకోసం త‌న పేరిట ఉన్న కొంత ఆస్తిని తేజ్‌ పేరిట రాయమని తన భ‌ర్త‌కి చెబుతుంది. కానీ భ‌ర్త త‌న మాట విన‌క‌పోవ‌డంతో ఆఖ‌రి కోరిక‌గా కూతురు నందిని (అనుప‌మ ప‌ర‌మేశ్వ‌రన్‌)కి చెబుతుంది. దాంతో త‌న త‌ల్లి కోరిక‌ని నెర‌వేర్చేందుకు లండ‌న్ నుంచి వ‌స్తుంది నందిని.

తేజ్ ఐ లవ్యూ’లో హీరోకు ఐలవ్యూ చెప్పడానికి హీరోయిన్ వస్తుంది. కానీ ఆ సమయంలో అతను మిస్సవుతాడు. అంతలో యాక్సిడెంట్ అవుతుంది. ఆమెకు మెమొరీ లాస్ అవుతుంది. కానీ అది పూర్తిగా కాదట. సరిగ్గా హీరోను కలిసే దగ్గర్నుంచి ఆమెకు గతం గుర్తు లేకుండా పోతుందట. అది న‌చ్చ‌క‌పోయినా, లోప‌ల ఎక్క‌డో న‌చ్చుతున్నా.. పైకి న‌చ్చ‌న‌ట్టు క‌నిపిస్తూ మ‌రొక‌రు ఆ డీల్ కోసం కృషి చేయ‌డం, తీరా ప్రేమ‌ను చెప్పుకోవాల్సిన స‌మ‌యంలో దానికి ఆటంకం క‌ల‌గ‌డం, చివ‌రికి హీరో, హీరోయిన్లు ఇద్ద‌రూ త‌మ ప్రేమ‌తో ఒక‌టి కావ‌డం అనేది ఏమి కొత్త కాదు. చెల్లెలిని న‌చ్చిన‌వాడికిచ్చి పెళ్లి చేసి, అది ఇంట్లో వాళ్ల‌కు న‌చ్చ‌క‌పోవ‌డంతో ఇంటికి దూరంగా ఉండ‌టం కూడా కొత్త కాదు

Tej I Love You Review,

చివర్లో మాత్రం కొంచెం సెంటిమెంట్.. ఫీల్ వర్కవుట్ చేయగలిగాడు కానీ.. మిగతా సమయమంతా చాలా భారంగా గడుస్తుంది. తలా తోకా లేని విధంగా సాగే కథాకథనాలు ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెడతాయి. ప్రేమకథలకు అవసరమైన సాంకేతిక ఆకర్షణలు కూడా పెద్దగా లేకపోవడంతో ‘తేజ్ ఐ లవ్యూ’ ప్రేక్షకుల్ని తీవ్ర నిరాశకే గురి చేస్తుంది. ఒకట్రెండు పాటలు.. యువతను ఆకట్టుకునే అనుపమ పరమేశ్వరన్ అందం-నటన.. కొన్ని సన్నివేశాలు మాత్రమే ‘తేజ్ ఐ లవ్యూ’లో చెప్పుకోదగ్గ అంశాలు తేజ్ ఫ్యామిలీ మెంబ‌ర్స్ పాత్ర‌ల్లో న‌టించిన‌వారంద‌రూ బాగా చేశారు. క‌థ‌లో ట్విస్టులు లేక‌పోవ‌డం, ఎంపిక చేసుకున్న స‌మ‌స్య‌ను కూడా లోతుగా చూపించ‌క‌పోవ‌డం వంటివాటివ‌ల్ల సినిమా అనాసక్తిగా, నిదానంగా సాగిన‌ట్టు అనిపిస్తుంది.

నటీనటులు:

సాయిధరమ్ తేజ్ గత సినిమాలకు భిన్నంగా కనిపించే ప్రయత్నం చేశాడు. చాలా వరకు యాక్షన్ జోలికి వెళ్లకుండా సాధారణంగా కనిపించే ప్రయత్నం చేశాడు. ఐతే ఎప్పుడూ చేయని పూర్తి స్థాయి లవ్ స్టోరీ చేసినా అతను ఇందులో మాత్రం కొత్తగా ఏమీ కనిపించడు తేజ్. వైవా హ‌ర్ష‌, పృథ్వీ త‌దిత‌రుల‌తో క‌లిసి హాస్యం పండించే ప్ర‌య‌త్నం చేశాడు. అనుప‌మ తండ్రిగా అనీష్ కురువిల్లా న‌టించాడు. సాయిధ‌ర‌మ్ తేజ్ పెద‌నాన్న‌, పెద్ద‌మ్మ పాత్ర‌ల్లో అనుభ‌వజ్ఞులైన జ‌య‌ప్ర‌కాష్‌, ప‌విత్ర లోకేష్‌లు క‌నిపిస్తారు. కానీ ఆ పాత్ర‌లు కూడా నామమాత్రంగానే అనిపిస్తాయి.

సాంకేతికవర్గం:

కానీ ఒక లవ్ స్టోరీకి అవసరమైన స్థాయిలో ఫీల్ లేకపోయింది. పాటల్లో ఒకట్రెండు బాగున్నాయి అంతే. ‘అందమైన చందమామ..’ పాట ఒక్కటి మళ్లీ మళ్లీ వినాలనిపించేలా ఉంది. నేపథ్య సంగీతం ఇంకా బాగుండాల్సిందనిపిస్తుంది. డార్లింగ్ స్వామి మాట‌లు అక్క‌డ‌క్క‌డా ప‌ర్వాలేద‌నిపిస్తాయి. నిర్మాణ విలువ‌లు క్రియేటివ్ క‌మ‌ర్షియ‌ల్స్ సంస్థ స్థాయికి ఏమాత్రం త‌గ్గ‌లేదు. ద‌ర్శ‌కుడు కరుణాక‌ర‌న్ క‌థ ప‌రంగా, క‌థ‌నం ప‌రంగా మ‌రోసారి తేలిపోయారు.

Tej I Love You Review

బ‌లాలు:

సాయిధ‌ర‌మ్ తేజ్ , అనుప‌మ న‌ట‌న

అక్క‌డ‌క్క‌డా హాస్యం

నిర్మాణ విలువ‌లు

లొకేష‌న్స్, కాస్ట్యూమ్స్

బ‌ల‌హీన‌త‌లు:

క‌థ‌, క‌థ‌నం ఫీల్

వినోదం కొర‌వ‌డ‌టం

సంగీతం

స్క్రీన్‌ప్లే

రేటింగ్‌: 2.25/5