‘మా ఇద్దరికీ పెళ్లి చేయమని అడిగాను’ సల్మాన్‌ఖాన్
Spread the love

బాలీవుడ్‌ మోస్ట్‌ ఎలిజబుల్‌ బ్యాచిలర్‌ సల్మాన్‌ ఖాన్‌ పెళ్లి గురించి ఆయన కుటుంబ సభ్యులతో పాటు అభిమానులు కూడా ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తూనే ఉన్నారు. పలువురు హీరోయిన్‌లతో ప్రేమాయణం కొనసాగించిన సల్మాన్‌ పెళ్లి విషయంలో ఇంతవరకు ఎటువంటి క్లారిటీ ఇవ్వడం లేదు. ఈ విషయాన్ని సల్మాన్ స్వయంగా ఒక ఇంటర్వ్యూలో వివరించారు.

బాలీవుడ్‌లో మాజీ హీరోయిన్‌, కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ఫ్రాంచైజీ సహ యజమాని జూహి చావ్లా గురించి మాట్లాడిన సల్మాన్‌ పలు ఆసక్తిర విషయాలు వెల్లడించారు. ‘తను చాలా ఆత్మీయత కలిగిన వ్యక్తి. తన వ్యక్తిత్వం నాకెంతగానో నచ్చింది. అందుకే వాళ్ల నాన్న దగ్గరికి జూహితో నా పెళ్లి జరిపిస్తారా అని అడిగాను. కానీ ఆయన కుదరదంటూ నా ముఖం మీదే చెప్పేశారని’  సల్మాన్‌ వ్యాఖ్యానించాడు. మరి జూహి వాళ్ల నాన్న ఎందుకు అంగీకరించలేదని అడగగా.. ‘తనకి నేను సరిపోనని భావించారేమో’  అంటూ సల్మాన్‌ నవ్వులు చిందించాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. కాగా సల్మాన్‌ ఖాన్‌, జూహి చావ్లాలు ఒక్క సినిమాలో కూడా కలిసి నటించలేదు.