రివ్యూ: పంతం
Spread the love

నటీనటులు: గోపీచంద్ – మెహ్రీన్ కౌర్ – సంపత్ రాజ్ – ముకేష్ రుషి – తనికెళ్ల భరణి – శ్రీనివాసరెడ్డి – పృథ్వీ – జయప్రకాష్ రెడ్డి – కౌముది – పవిత్ర లోకేష్ – హర్షవర్ధన్ తదితరులు

సంగీతం: గోపీసుందర్, మెహ్రీన్ కౌర్‌, శ్రీనివాస‌రెడ్డి, పృథ్వి, సంప‌త్ త‌దిత‌రులు

ఛాయాగ్రహణం: ప్రసాద్ మూరెళ్ళ

మాటలు: రమేష్ రెడ్డి, శ్రీకాంత్‌

క‌ళ‌ : ఎ.ఎస్‌.ప్ర‌కాశ్‌

స్క్రీన్ ప్లే : కె.చక్రవర్తి – బాబీ

నిర్మాత: కె.కె.రాధామోహన్

కథ : కె.చక్రవర్తి

మాస్ సినిమాలతో మంచి స్థాయిని అందుకున్న హీరో గోపీచంద్. ఐతే గత కొన్నేళ్లుగా అతడి ట్రాక్ రికార్డు ఏమంత బాగా లేదు. ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు టి.కృష్ణ త‌న‌యుడిగా సినీ రంగ ప్రవేశం చేసిన గోపీచంద్ కెరీర్ తొలినాళ్ల‌లో విల‌న్‌గా కూడా న‌టించి మెప్పించాడు. హీరోగా మారిన త‌ర్వాత హిట్స్ సాధించినా.. త‌ర్వాత విజ‌యాల ప‌రంప‌ర‌ను అందుకోవ‌డంలో స‌త‌మ‌తమ‌వుతూ వ‌స్తున్నాడు. కొత్త దర్శకుడు చక్రవర్తి తెరకెక్కించిన ‘పంతం’ గోపిచంద్‌ కెరీర్‌ను గాడిలో పెడుతుందా..? మాస్ హీరోగా గోపిచంద్ సక్సెస్‌ సాధించాడా..?

కథ:

విక్రాంత్ (గోపీచంద్) హైదరాబాద్ లోని ఒక కాలనీలో మామూలు వ్యక్తిలా తిరుగుతుంటాడు. కానీ అతను ఎవరికీ తెలియకుండా దొంగతనాలు చేస్తుంటాడు. హోం మంత్రి (సంపత్ రాజ్)ను లక్ష్యంగా చేసుకుని అతను ఎక్కడెక్కడో దాచుకున్న వేల కోట్ల రూపాయల్ని తెలివిగా కాజేస్తాడు. మ డ‌బ్బును కొట్టేసిన వ్య‌క్తి ఎవ‌రో ఒకానొక స‌మ‌యంలో జ‌యేంద్ర‌కు తెలుస్తుంది. అయితే ఆ వ్య‌క్తి మామూలు వాడు కాద‌నీ, ప్ర‌పంచంలో టాప్ టెన్ రిచెస్ట్ పీపుల్ లో ఒక‌రైన సురానా ఇండ‌స్ట్రీ అధినేత కుమారుడ‌ని అర్థ‌మ‌వుతుంది.

విశ్లేషణ:

హీరో అందరిలో ఒకడిలా కనిపిస్తాడు. కానీ ఎవ్వరికీ తెలియకుండా బడా బాబుల్ని దోచేస్తుంటాడు. కట్ చేస్తే ఒక ఫ్లాష్ బ్యాక్. అందులో ఒక విషాద ఘట్టం. దాన్ని చూసే కదిలిపోయిన హీరో దొంగగా మారతాడు. దోచేసిన డబ్బులతో అభాగ్యుల్ని ఆదుకుంటూ ఉంటాడు. ఒక‌వైపు కోటీశ్వ‌రుడిగా.. మ‌రోవైపు రాజ‌కీయ నాయ‌కుల న‌ల్ల‌ధ‌నాన్ని దోచుకునే దొంగ‌గా మెప్పించాడు. లుక్స్ ప‌రంగా చూడ‌టానికి బావున్నాడు. క్లైమాక్స్ సీన్‌లో ప‌వ‌ర్‌ఫుల్ డైలాగ్స్ చెప్పే సంద‌ర్భంలోనూ గోపీచంద్ న‌ట‌న ప్ర‌శంస‌నీయం. అలాగే యాక్ష‌న్ సీన్స్‌లో గోపీచంద్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు అద‌ర‌గొట్టేశాడు. ఇక మెహ‌రీన్ పాత్ర పాట‌ల‌కే ప‌రిమితం అయ్యింది. ఫ‌స్టాఫ్‌లో ఆమె రోల్ ఎక్కువ సేపు తెర‌పై క‌న‌ప‌డినా సెకండాఫ్‌లో పాట‌ల‌కు మాత్ర‌మే ప‌రిమితం అయ్యింది.

అవినీతి, లంచగొండితనం, ప్రభుత్వ పథకాలు అందవలసిన వారికి సరిగ్గా అందకపోవడం వంటి పాయింట్లపై గోపీచంద్‌ పలికిన సుదీర్ఘమైన సంభాషణలు రచయితగా దర్శకుడిలో ఉన్న ప్రతిభను చూపిస్తాయి. పతాక సన్నివేశాల్లో రొటీన్‌గా యాక్షన్‌ జోలికి పోకుండా డైలాగులతో సరిపెట్టేశారు. ద్వితీయార్థంలో చాలా స్టైలిష్‌గా కనిపించాడు. కోర్టు సన్నివేశాల్లో సుదీర్ఘమైన సంభాషణలు బాగా పలికాడు. మెహరీన్‌కు ఏమాత్రం ప్రాధాన్యం లేని పాత్ర దక్కింది. గోపీచంద్‌ పక్కన మరీ బొద్దుగా కనిపించింది. ‘మిర్చి’ సంపత్‌, జయప్రకాశ్‌, ముఖేశ్‌ రుషి, తనికెళ్ల భరణి ఇలా ఎవర్ని తీసుకున్నా వారి పాత్రలకు తగిన న్యాయం చేశాడు దర్శకుడు.

ఓవరాల్ గా చూస్తే గోపీచంద్ కు మంచి ఫాలోయింగ్ ఉన్న మాస్ ప్రేక్షకులు కోరుకునే అంశాలు ‘పంతం’లో ఉన్నాయి. కానీ కొత్తదనం ఆశిస్తే మాత్రం ‘పంతం’ నిరాశ పరుస్తుంది. గోపీచంద్ తన 25వ సినిమా కోసం సామాజికాంశాలతో ముడిపడ్డ కథను ఎంచుకోవడం ఓకే కానీ.. తన గత సినిమాల ఫలితాలు.. ప్రస్తుత ట్రెండును దృష్టిలో ఉంచుకుని కొత్తదనం మీద కూడా దృష్టిపెట్టాల్సింది.

నటీనటులు:

గోపీచంద్ బాగానే చేశాడు. నటన పరంగా కొత్తదనం చూపించడానికి ఈ సినిమా పెద్దగా అవకాశమివ్వలేదు. ఐతే కోర్టు సీన్లో అతడి నటన డైలాగులు చెప్పడంలో ఇంటెన్సిటీ ఆకట్టుకుంటాయి. యాక్షన్ సన్నివేశాల్లో ఎప్పట్లాగే తన అభిమానులకు నచ్చేలా చేశాడు.  ఉన్నంతలో తన వంతుగా ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. విలన్‌గా సంపత్‌ రాజ్‌ రొటీన్‌ పాత్రలో కనిపించారు. అవినీతి పరుడైన రాజకీయ నాయకుడిగా తనదైన స్టైల్‌లో మెప్పించారు. ఇతర పాత్రల్లో జయప్రకాష్, పృథ్వీ, షియాజీ షిండే, ముఖేష్ రుషి, తనికెళ్ల భరణి తమ పరిధి మేరకు ఆకట్టుకున్నారు.

సాంకేతిక విభాగం:

నిర్మాత రాధామోహన్ సినిమాను చాలా రిచ్‌గా నిర్మించారు. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. సినిమాటోగ్రాఫర్ ప్రసాద్ మూరెళ్ల కెమెరా వర్క్ చాలా బాగుంది. ఈ చిత్రానికి సంగీత దర్శకుడెవరో తెలియకుండా వెళ్లి సినిమా చూశాక గోపీసుందర్ పని చేశాడంటే ఆశ్చర్యపోతారు.

ప్లస్‌ పాయింట్స్‌ ;

గోపిచంద్‌ నటన

కోర్టు సీన్‌

యాక్షన్‌ సీన్స్‌

కొన్ని సంభాషణలు

మైనస్‌ పాయింట్స్‌ ;

హీరోయిన్‌

సంగీతం

హీరో, హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ

రొటీన్‌ కథ

రేటింగ్: 2.5/5