156వ రోజు ప్రారంభమైన  ప్రజాసంకల్పయాత్ర
Spread the love

 

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, జననేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన పాదయాత్ర కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గంలో విజయవంతంగా కొనసాగుతుంది. గుడివాడ నుంచి మంగళవారం ఉదయం వైఎస్‌ జగన్‌ 156వ రోజు పాదయాత్రను ప్రారంభించారు.

అక్కడి నుంచి మల్లయ్య పాలెం క్రాస్‌ రోడ్డు, చౌటపల్లి, పెద పాలపర్రు మీదుగా కల్వపుడి అగ్రహారం క్రాస్‌ రోడ్డు చేరుకుంటారు. అక్కడ జననేత భోజన విరామం తీసుకుంటారు. పాదయాత్ర తిరిగి మధ్యాహ్నం 02.45 గంటలకు ప్రారంభమౌతుంది. అనంతరం పాదయాత్ర కోడురు క్రాస్‌ రోడ్డు, చిన్నపాలపర్రు క్రాస్‌ రోడ్డు మీదుగా ముదినేపల్లి వరకు కొనసాగుతుంది. రాత్రికి రాజన్న బిడ్డ ఇక్కడే బస చేస్తారు. ప్రజాసమస్యలు తెలుసుకుంటూ.. వారికి నేనున్నా అని భరోసానిస్తూ పాదయాత్రలో జననేత ముందుకు సాగుతున్నారు. ప్రజలు అడగడుగునా రాజన్న బిడ్డకు నీరాజనాలు పలుకుతున్నారు.