కర్ణాటకలో ఉపఎన్నికలు  కాంగ్రెస్‌-జేడీయూ గెలుపు
Spread the love

కర్ణాటకలోని మూడు లోక్‌సభ, రెండు శాసనసభ స్థానాలకు జరిగిన ఉప-ఎన్నికల ఓట్ల లెక్కింపు మంగళవారం నాడు ప్రారంభమైన విషయం తెలిసిందే. ఇక, రెండు శాసనసభ స్థానాలకు ఓట్ల లెక్కింపు కొద్దిసేపటి కిందటే ముగిసింది. రామనగర అసెంబ్లీ స్థానం నుంచి సీఎం సతీమణి, జేడీఎస్ అభ్యర్థి అనితా కుమారస్వామి ఘన విజయం సాధించారు. ఈ స్థానంలో బీజేపీ తరఫున పోటీచేసిన అభ్యర్థి పోలింగ్‌కు మూడు రోజుల ముందే ఆ పార్టీకి రాజీనామాచేసి కాంగ్రెస్‌లో చేరారు. దాంతో అనితా కుమారస్వామి గెలుపు లాంఛనమైంది. జమఖండిలోనూ కాంగ్రెస్ అభ్యర్థి ఆనంద్ ఎస్ న్యామగౌడ 50 వేలు ఓట్ల ఆధిక్యంలో గెలుపొందారు. ఇప్పటి వరకు వెలువడిన ఫలితాల ప్రకారం శివమొగ్గ లోకసభ స్థానంలో తప్పా మిగతా రెండు చోట్ల అధికార కాంగ్రెస్- జేడీఎస్ కూటమి అభ్యర్థులు ముందంజలో ఉన్నారు.

మరో అసెంబ్లీ నియోజకవర్గం జమఖండీలో కాంగ్రెస్‌ అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే సిద్ధు న్యామగౌడ కుమారుడు ఆనంద్‌ విజయం సాధించారు.

ఇక బళ్లారి లోక్‌సభ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ భారీ ఆధిక్యంలో ఉండగా.. మరో లోక్‌సభ నియోజకవర్గం శివమొగ్గలో కాంగ్రెస్‌-భాజపా మధ్య హోరాహోరీ పోటీ నెలకొంది. శివమొగ్గలో భాజపా అభ్యర్థి, మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప తనయుడు రాఘవేంద్ర తన సమీప జేడీఎస్‌ అభ్యర్థి మధు బంగారప్పపై స్వల్ప ఆధిక్యంలో ఉన్నారు.