ఎపి నూతన డిజిపిగా ఠాకూర్
Spread the love

ఆంధ్రప్రదేశ్‌ కొత్త డీజీపీగా ఆర్పీ ఠాకూర్‌ నియమితులయ్యారు. ప్రస్తుతం అవినీతి నిరోధకశాఖ డైరెక్టర్‌ జనరల్‌గా ఉన్న ఠాకూర్‌ను డీజీపీగా నియమిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇవాల ఉదయం డీజీపీగా మాలకొండయ్య పదవీ విరమణ కార్యక్రమంలో అనంతరం నూతన డీజీపీ ఎంపికపై చంద్రబాబు కసరత్తు చేశారు. మాలకొండయ్య, ఏసీబీ డీజీ ఆర్పీ ఠాకూర్‌, ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ ఏబీ వెంకటేశ్వరరావులతో సమావేశం అనంతరం నూతన డీజీపీపై చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. ఐపిఎస్ అధికారి ఠాకూర్ 1986 బ్యాచ్‌కు చెందినవారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అనేక ప్రాంతాల్లో కీలక పోస్టుల్లో పని చేశారు. రామ్ ప్రవేశ్ ఠాకూర్ 1961 జూలై 1న జన్మించారు. ఐఐటి కాన్పూర్‌లో సివిల్ ఇంజినీరింగ్ విభాగంలో బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ చదివారు.

అంతకుముందు పదవీవిరమణ చేసిన డీజీపీ మాలకొండయ్యకు ఘనంగా వీడ్కోలు చేయాలనీ  పరేడ్ నిర్వహించారు. గుంటూరు జిల్లా మంగళగిరి 6వ బెటాలియన్‌లోని కవాతు మైదానంలో ఏర్పాటు చేసిన పరేడ్‌లో 8 బెటాలియన్‌ల సిబ్బంది పాల్గొన్నారు. వీరి నుంచి మాలకొండయ్య గౌరవ వందనం స్వీకరించారు.

ఏడీజీగా ఉమ్మడి రాష్ట్రంలో కంట్రోలర్ ఆఫ్ లీగల్ మెట్రాలజీ అధిపతిగా బాధ్యతలు నిర్వహించారు. రాష్ట్ర విభజన అనంతరం నవ్యాంధ్ర విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ డీజీ, ఏడీజీపీ (లా అండ్ ఆర్డర్)గా బాధ్యతలు నిర్వహించారు. 2016 నవంబర్ 19 నుంచి రాష్ట్ర అవినీతి నిరోధక శాఖ డీజీగా బాధ్యతల నిర్వహిస్తోన్న ఆర్పీ ఠాకూర్ 2003లో ఇండియన్ పోలీసు మెడల్, 2004 లో ఏఎస్‌ఎస్పీ మెడల్ సాధించారు. పోలీసు శాఖలో విశిష్ట సేవలకు గుర్తింపుగా 2011లో భారత రాష్ట్రపతి చేతుల మీదుగా రాఠూక్ మెడల్ పొందారు. ప్రస్తుతం ఆయన ఏపీ కొత్త డీజీపీగా ఆర్పీ ఠాకూర్‌ను ప్రభుత్వం నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో డీజీ హోదాలో రాష్ట్రంలో పోలీసు దళాల అధిపతి ఆర్.పి.ఠాకూర్ బాధ్యతలు చేపట్టనున్నారు.

హైదరాబాద్‌లోని జాతీయ పోలీసు అకాడమీలో అదనపు ఎస్పీగా ఠాకూర్ తొలి నియామకం జరిగింది. అనంతరం గుంటూరు, వరంగల్ జిల్లాల్లో ఏఎస్పీగా, అలాగే పశ్చిమగోదావరి, కడప, కృష్ణా, వరంగల్ జిల్లాల ఎస్పీలుగా ఠాకూర్ బాధ్యతలు నిర్వహించారు. జోనల్ హైదరాబాద్ డీసీపీగా, అనంతపురం, చిత్తూరు జిల్లాల డీఐజీగా బాధ్యతలు చేపట్టారు. ఆపై పాట్నాలోని ఈస్ట్రన్ జోన్ హెడ్ క్వాటర్స్(సీఐఎస్‌ఎఫ్) డీఐజీగా బాధ్యతలు నిర్వహించారు. ఐజీగా పదోన్నతి పొంది హైదరాబాద్‌లోని డ్రగ్స్ అండ్ కాపీ రైట్స్ డీజీగా బాధ్యతలు చేపట్టారు.

ఆయన సర్వీసులు అందించిన మరిన్ని శాఖలు

పాట్నాలోని ఈస్ట్రన్ జోన్ హెడ్ క్వార్టర్స్‌ (సీఐఎస్‌ఎఫ్‌) డీఐజీగా బాధ్యతలు

ఐజీగా పదోన్నతి పొంది హైదరాబాద్ లోని డ్రగ్స్ అండ్ కాపీ రైట్స్ డీజీగా సర్వీస్‌

ఏడీజీగా ఉమ్మడి రాష్ట్రంలో కంట్రోలర్ ఆఫ్ లీగల్ మెట్రాలజీ అధిపతి సేవలు

రాష్ట్ర విభజన అనంతరం ఆయన నవ్యాంధ్ర విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ డీజీ, ఏడీజీపీ (లా అండ్ ఆర్డర్)గా బాధ్యతలు

అందుకున్న మెడల్స్‌

2003లో ఇండియన్ పోలీసు మెడల్

2004 లో ఏఎస్‌ఎస్సీ మెడల్ సాధించిన ఠాకూర్