సాయి ధరమ్ తేజ్ ‘చిత్రలహరి’కి పవన్ కళ్యాణ్ ప్రశంసలు
Spread the love

సాయి ధరమ్ తేజ్ హీరోగా కిషోర్ తిరుమల దర్శకత్వంలో రూపొందిన మూవీ ‘చిత్రలహరి’. భారీ అంచనాలతో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద తొలి రోజు పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. వరుస ప్లాపుల తర్వాత ఎట్టకేలకు సాయి ధరమ్ తేజ్ ఖాతాలో హిట్టు పడింది.

మొత్తానికి తమ మేనల్లుడి కెరీర్ మళ్లీ గాడిలో పడటంతో మెగాస్టార్ చిరంజీవి, పవన్ కళ్యాణ్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి చిత్ర బృందంపై ప్రశంసలు గుప్పించారు. దర్శకుడు కిపోర్ తిరుమల చక్కటి మేసేజ్‌తో ఆద్యంతం చక్కగా సినిమాను నడిపించారని, సాయి తేజ్ పరిణితితో కూడిన నటనతో ఆకట్టుకొన్నాడంటూ పొగిడేశారు.