రెడ్ మీ బారి డిస్కౌంట్ సేల్
Spread the love

చైనా కంపెనీ షావోమి ఐ లవ్‌ ఎంఐ డేస్‌ పేరుతో మూడు రోజుల సేల్‌ను ప్రకటించింది.ఫ్లిప్‌కార్ట్ తోపాటు ఎంఐ స్టోర్లలో తగ్గింపు ధరల్లో ఈ ప్రత్యేక సేల్ నిర్వహిస్తుంది. ఫిబ్రవరి 11 మొదలైన ఈ సేల్ ఫిబ్రవరి 13 వరకు సాగుతుంది. రెడ్‌మి స్మార్ట్‌ఫోన్లు, ఎంఐ టీవీలు, ఎంఐ బ్యాండ్స్‌ , పవర్‌ బ్యాంక్స్‌తో పాటు ఇతర యాక్ససరీస్ పై భారీ డిస్కౌంట్లను అందిస్తోంది. రెడ్‌ మి నోట్‌ 6 ప్రొ, పోకో ఎఫ్‌1లాంటి స్మార్ట్‌ఫోన్లపై రూ.3000 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. దీంతో పాటు నో – కాస్ట్‌ ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంది. ఇక షావోమి 43 అంగుళాల ఎంఐ 4ఏ టీవీని రూ. 22,999లకు లభ్యం. 49 అంగుళాల ఎంఐ 4ఏ టీవీని రూ. 30,999లకు అందిస్తోంది. ఇంకా 10ఎంఏహెచ్‌ సామర్థ్యం గల పవర్‌బ్యాంకును రూ.899కే అందిస్తోంది.