స్నేహంగా ఉన్నాం కదా అని ఫొటోదిగితే, ఇప్పుడు అవే   ఫొటోతో  బెదిరిస్తున్నాడు !!
Spread the love

ఒక్కప్పుడు స్నేహంగా ఉండేవాళ్లము , ఇప్పుడు అదే స్నేహాన్ని అడ్డుగా పెట్టుకొని నాతో ఫొటోలు దిగాడు. వాటిని ఇప్పుడు చూపిస్తూ అతనితో శారీరక సంబంధం పెట్టుకోవాలని వేధిస్తున్నాడు. లేకుంటే ఫొటోలను నీ భర్తకు చూపుతానని బెదిరిస్తున్నాడు’’ అంటూ ప్రకాశం జిల్లాకు చెందిన వివాహిత సోమవారం రూరల్‌ ఎస్పీ ఎస్‌.వి.రాజశేఖరబాబును కలసి ఫిర్యాదు చేసింది.

బాధితురాలి మాటలు చూద్దాం … నకరికల్లు మండలం చల్లగుళ్ల అడ్డరోడ్డుకు చెందిన బేగ్‌ అమీర్‌బాషాతో పరిచయం స్నేహంగా మారింది. ఇద్దరం కలసి ఫొటోలు దిగాం. ఫోన్‌లో మాట్లాడుకున్నాం కూడా . ఈ ఏడాది మే నెలలో ప్రకాశం జిల్లాకు చెందిన వ్యక్తితో నా వివాహం జరిగింది. అయితే అప్పటి నుంచి అతనితో దిగిన ఫొటోలు చూపించి, శారీరక సంబంధం పెట్టుకోవాలని తీవ్రంగా ఒత్తిడి చేస్తున్నాడు అతను . నేను అందుకు అంగీకరించకపోవడంతో అతని వద్ద ఉన్న ఫొటోలు, ఫోన్‌ రికార్డింగ్‌లను నాభర్తకు పంపుతానని బెదిరించి , వాటిని అందరికీ తెలియ చేసి నీకాపురం కుప్పకూల్చుతానని హెచ్చరిస్తున్నాడు. అయితే అప్పుడు తెలిసీ తెలియక అతనితో స్నేహం చేసిన పాపానికి నిత్యం మానసిక వేదనకు గురవుతున్నాను. ఆత్మహత్యకు కూడా సిద్ధమయ్యాను. అతని వద్ద ఉన్న ఆధారాలను మొత్తం నాకు అప్పగించి నాకు మనశ్శాంతిని చేకూర్చండి అంటూ వేడుకుంది. సానుకూలంగా స్పందించిన ఎస్పీ వెంటనే సదరు యువకుడిని స్టేషన్‌కు తీసుకువచ్చి సమస్యను పరిష్కరించాలని నకరికల్లు ఎస్‌ఐను ఆదేశించారు. ఎలాంటి భయాందోళనలకు గురికావాల్సిన అవసరం లేదని వివాహితకు ఎస్పీ ధైర్యం చెప్పి పంపారు.