ఇక ఆధార్ నంబర్ లేకుండానే సిమ్ కార్డ్ పొందవచ్చు..
Spread the love

మీ సిమ్ కార్డును ఆధార్ తో అనుసంధానించారా? లేదంటే వెంటనే చేయండి. ఆధార్ తో సిమ్ కార్డులను లింక్ చేయడాన్ని కేంద్రం తప్పనిసరి చేసింది. లేకపోతే మీ ఫోన్ నంబర్ డీయాక్టివేట్ అవుతుంది అని చెప్పింది. కానీ ప్రస్తుతం కొత్త సిమ్ పొందడానికి ఆధార్ అవసరం లేదంటోంది టెలికాం శాఖ. ఆధార్ భద్రతపై అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో కొత్త విధానాన్ని అందుబాటులోకి తీసుకవస్తోంది.

ఈ విధానం ప్రకారం ఆధార్ నంబర్ స్థానంలో కొత్త నంబర్‌ను టెలికాం ఆపరేటర్లకు ఇవ్వాలి. ఈ నంబర్‌నే వర్చువల్ ఐడీ అంటారు. ఈ వర్చువల్ ఐడీ నంబర్‌తో ఆధార్ అవసరం లేకుండానే సిమ్ పొందవచ్చు. ఈ మేరకు ఆధార్ వ్యవహారాలు చూసుకుంటున్న యూఐడీఏఐ… టెలికాం శాఖకు ఆదేశాలు జారీ చేసింది. దానికి అనుగుణంగా టెలికాం ఆపరేటర్లు సిద్ధమవుతున్నారు. జూలై 1 నుంచి ఈ పద్ధతి అందుబాటులోకి రానుంది.

కానీ వర్చువల్ ఐడీ పొందడం ఎలా.?

ఆధార్‌లో 12 అంకెల నంబర్ ఉంటే.. వర్చువల్ ఐడీలో 16 అంకెల నంబర్ ఉంటుంది. అయితే ఈ నంబర్ పొందడానికి ఆధార్(యూఐడీఏఐ) సైట్‌లో వర్చువల్ ఐడీ నంబర్‌ను జనరేట్ చేసుకోవాలి. అది ఎలా చేసుకోవాలంటే

https://resident.uidai.gov.in/web/resident/vidgeneration కి వెళితే నంబర్‌ను జనరేట్ చేసుకోవచ్చు.