వాట్సాప్‌లో మరో బిగ్‌ ఫీచర్‌, వారికోసమే..
Spread the love

వాట్సాప్‌… రోజుకో కొత్త అప్‌డేట్‌తో ఇటీవల తరచూ వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా తాను కొత్తగా తీసుకొచ్చిన వాట్సాప్‌ బిజినెస్‌ యాప్‌ను  మరింత మందికి చేరువ చేసి, వ్యాపారాలకుఉపయోగపడేందుకు ఓ కొత్త ఫీచర్‌ను తీసుకు రాబోతుంది. అదే ‘ఛాట్‌ ఫిల్టర్స్‌’  ఫీచర్‌. దీని ద్వారా వాట్సాప్‌ బిజినెస్‌ అకౌంట్స్‌ అడ్మిన్లు త్వరగా మెసేజ్‌లను సెర్చ్‌ చేసుకోవచ్చు. అవసరమైన కస్టమర్లను త్వరగా సెర్చ్‌ చేసుకునేందుకు వ్యాపారస్తులకు సాయం చేయాలని ఈ సోషల్‌ మీడియా దిగ్గజం నిర్ణయించింది. ఈ క్రమంలోనే ‘ఛాట్‌ ఫిల్టర్స్‌’ అనే ఫీచర్‌ను తన బిజినెస్‌ యాప్‌కు యాడ్‌ చేసింది. ఈ ఫిల్టర్స్‌ను యాక్సస్‌ చేసుకోవడానికి సెర్చ్‌ బార్‌పై అడ్మిన్‌ ట్యాప్‌ చేయాల్సి ఉంటుంది. ఈ ‘ఛాట్‌ ఫిల్టర్స్‌’  ఫీచర్‌ యూజర్లను అన్‌రీడ్‌ ఛాట్స్‌, గ్రూప్స్‌, బ్రాడ్‌కాస్ట్‌ కేటగిరీల కింద గ్రూప్‌ చేయనుంది. ఇది అచ్చం ఇన్‌స్టాగ్రామ్‌లోని ‘యాక్షన్‌ బటన్‌’ మాదిరే పనిచేస్తుంది.  ఈ యాక్షన్‌ బటన్‌ కూడా ముఖ్యమైన కస్టమర్లను డైరెక్ట్‌గా ఇన్‌బాక్స్‌లోకి తీసుకొస్తుంది.

ప్రస్తుతం వాట్సాప్‌ తీసుకొస్తున్న ‘ఛాట్‌ ఫిల్టర్స్‌’ అనే ఫీచర్‌తో వ్యాపారాలను మెరుగ్గా చేసుకునే అవకాశముంటుంది.ముఖ్యమైన కస్టమర్లకు మంచి సేవలను అందించవచ్చు. వారి ప్రాధాన్యత బట్టి కమ్యూనికేషన్‌ను నిర్వహించవచ్చు.  వాట్సాప్‌ ఫర్‌ బిజినెస్‌ అనే యాప్‌ను ఈ ఏడాది జనవరిలోనే లాంచ్‌ చేసిన సంగతి తెలిసిందే. చిన్న, మధ్య తరహా వ్యాపారులను దృష్టిలో ఉంచుకొని ఈ బిజినెస్ యాప్‌ను వాట్సాప్ తీసుకొచ్చింది. సొంతంగా వ్యాపారాన్నినిర్వహిస్తున్నవారు ఈ బిజినెస్ యాప్ ద్వారా తమ వినియోగదారులతో టచ్‌లో ఉండొచ్చు. సులభంగా వ్యాపార కార్యకలాపాలను నిర్వహించుకోవచ్చు. ఈ కొత్త యాప్‌ను పాత వాట్సాప్ మెసెంజర్ ప్లాట్‌ఫాం మీద రూపొందించినప్పటికీ.. అదనంగా కొన్ని కొత్త ఫీచర్లను జతచేశారు. వెరిఫైడ్ ప్రొఫైల్, క్విక్ రిప్లైస్, గ్రీటింగ్ మెసేజెస్, అవే మెసేజెస్ వంటి కొత్త ఫీచర్లు ఉన్నాయి. వాట్సాప్ మాదిరిగానే వాట్సాప్ బిజినెస్ యాప్‌ను చూడా ఎంతో సెక్యూర్‌గా రూపొందించారు. మీ కాల్స్, మెసేజ్‌లు థర్డ్‌పార్టీకి చేరకుండా ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్షన్‌ను ఈ యాప్‌లో పొందుపరిచారు.

అంతేకాదు ‘రిస్ట్రిక్టడ్‌ గ్రూప్‌’ ఫీచర్‌ను సైతం ఆండ్రాయిడ్‌ వెర్షన్‌ 2.18.142లో త్వరలో అందించనుందట వాట్సాప్‌ వెర్షన్‌ 2.18.84 ద్వారా స్టిక్కర్స్‌ ఆల్బమ్‌ను తీసుకొచ్చేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది.దీంతో పాటు గ్రూప్‌లోని సభ్యులను అడ్మిన్‌ బ్లాక్‌ చేసేలా మరికొన్ని ఫీచర్లను వాట్సాప్‌ త్వరలో జోడించబోతోంది. మరోవైపు బ్రాడ్‌కాస్ట్ మెసేజెస్‌ కేటగిరీలోనూ మరో అప్‌డేట్‌ను తీసుకొచ్చింది. తమ అడ్రస్‌ బుక్‌లో లేకపోయినా, సదరు నెంబరుకు బ్రాడ్‌ కాస్ట్‌ మెసేజ్‌ పంపేలా మార్పులు చేయబోతోంది. ఇక వాట్సాప్‌ బిజినెస్‌‌లో ఫిల్టర్స్‌నుఅందుబాటులోకి తీసుకొచ్చింది. సెర్చ్‌ ఆప్షన్‌ వద్ద ఫిల్టర్‌ ఆప్షన్‌ను క్లిక్‌ చేయడం ద్వారా దీన్ని ఉపయోగించుకోవచ్చు. వినియోగదారులు ఇందులో ‘అన్‌రీడ్‌ చాట్స్‌’, ‘గ్రూప్స్‌, బ్రాడ్‌ కాస్ట్ లిస్ట్’ అనే మూడు ఎంపికలు ఉంటాయి.