అప్పులన్నీ కట్టేస్తాకట్టేస్తా, నన్ను వదిలేయండి బాబోయ్  : విజయ్ మాల్యా
Spread the love

లిక్కర్ డాన్ విలాసపురుషుడైన వ్యాపారవేత్త విజయ్ మాల్యా సంచలన ప్రకటన చేశారు. వేలకోట్లు ఎగ్గొట్టిన విజయ్మాల్యా సంచలన ట్వీట్ చేశారు. ఒకింత భయమా లేకపోతే పరిస్థితుల ప్రభావమా లేదా తెలియదు కానీ విజయ్ మాల్యా కీలక ప్రకటన చేశారు. తాను బ్యాంకుల వద్ద తీసుకున్న రుణాల అసలు మొత్తాన్ని పూర్తిగా చెల్లిస్తానని ప్రకటించారు. విదేశాల్లో తలదాచుకుంటున్న మాల్యా ఈ మేరకు పలు ట్వీట్లలో తన అభిప్రాయాలు వెల్లడించారు. “బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలు నయా పైసా తో సహా తిరిగిచ్చేస్తా.. దయచేసి తీసుకోండి’ అంటూ బ్యాంకులు భారత ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మరో ఐదురోజుల్లో భారత్ దాఖలు చేసిన నేరస్తుల అప్పగింత కేసు పై యూకే కోర్టు తీర్పు వెలువరించనున్న నేపథ్యంలో మాల్యా ట్వీట్ చేయడంతో భయం వల్లే ఇలా చేశారనే చర్చ జరుగుతోంది. బ్యాంకు రుణాలు ఎగవేసినట్టు తనపై వస్తున్న ఆరోపణల్లో నిజం లేదని మాల్యా చెప్పుకొచ్చారు. తనను ఎగవేతదారుగా రాజకీయ నేతలు మీడియా యాజమనాలు ప్రయత్నిస్తున్నారని.. కానీ.. తాను రుణాలను పూర్తిగా చెల్లించేందుకు 2016లోనే ప్రతిపాదన చేశానని గుర్తు చేశారు. తాను కర్ణాటక హైకోర్టు ముందు చేసిన ప్రతిపాదనపై మీడియు ఎందుకు నోరు మెదపదని ప్రశ్నించారు. ‘ఏటీఎఫ్ ధరలు అధికంగా ఉన్నందున కింగ్ పిషర్ ఎయిర్లైన్స్ సంస్థ ఆర్థికంగా ఇబ్బందులు పడినమాట నిజమే. బ్యారెల్కు 140 డాలర్ల మేర అత్యధిక క్రూడాయిల్ ధరలు ఎదుర్కొన్న విమానయాన సంస్థ కింగ్ పిషర్. ఈ నష్టాల కారణంగా బ్యాంకుల సొమ్ము ఖర్చయిపోయింది. అయినప్పటికీ వాళ్లకు 100 శాతం అసలు మొత్తాన్ని ఇస్తానని చెప్పాను. దయచేసి తీసుకోండి..’ అని మాల్యా ట్విటర్లో విన్నవించుకున్నారు.

 viajya maalya sensational tweets about bank money

అయితే మరో ట్వీట్లో ‘మూడు దశాబ్దాలుగా దేశంలోనే అతిపెద్ద ఆల్కహాలిక్ బేవరేజ్ గ్రూప్ గా ఉన్నాం. పన్నుల రూపంలో వేలాది కోట్లు చెల్లించాం. కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ తరఫున కొన్ని దేశాలకు తోడ్పడ్డాం.ఇక ఈక్రమంలో ఎయిర్ లైన్స్ నష్టాల్లో కూరుకుపోవడం బాధాకరమే. అయినప్పటికీ బ్యాంకులకు ఎలాంటి నష్టం లేకుండా మొత్తం చెల్లిస్తానని చెప్పాను. ప్లీజ్.. తీసుకోండి’ అని మరో ట్వీట్ చేశారు. కాగా మాల్యా వినతికి కేంద్ర ప్రభుత్వం బ్యాంకులు ఏ విధంగా స్పందిస్తాయో ఇక చూడాలి మరి.