చెర్రీపై ఉపాసన ట్వీట్..!
Spread the love

సోషల్ మీడియాలో ఉపాసన చాలా యాక్టివ్ గా ఉంటారు. భర్త రామ్ చరణ్ కు – తనకు మధ్య జరిగే ఫన్నీ మూమెంట్స్ చాలా హ్యాపీగా చెప్పేస్తుంది ఉపాసన. తాజాగా ఉపాసన ఓ వీడియోని – కొన్ని ఫోటోల్ని సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసి ఆసక్తికర కామెంట్ ని ట్వీట్ చేశారు. ఒకప్పుడు కొంచెం లావుగా ఉన్న ఉపాసన తర్వాత స్ట్రిక్ట్ డైట్, ఫిట్ నెస్ మెయింటేన్ చేస్తూ స్లిమ్ లుక్‌లోకి వచ్చేసింది. అప్పటి నుండి ఆమె తనకు ఇష్టమైన స్వీట్స్, ఇతర ఫుడ్స్ కు దూరంగా ఉంటోంది. తన భార్య ఎంతగానో ఇష్టపడే డిసెర్ట్స్ బలవంతంగా తినిపించేశాడు. అంతేకాదు, “హేయ్ ఉప్సీ… నీ ఫుడ్ గురించి అంతగా స్ట్రెస్ అవ్వొద్దు. నీకు ఏది కావాలంటే అది తినేయ్… తర్వాత జిమ్‌లో వర్కౌట్స్ చేయ్ సరిపోతుంది” అంటూ చెర్రీ చెప్పిన విషయాన్ని ఫొటో సహా ట్వీట్ చేసింది ఉపాసన.