గొడుగుతో పాటు ఎగిరిపోయాడు!
Spread the love

గాలుల దాటికి ఓ వ్యక్తి గొడుగుతో పాటు గాల్లో ఎగిరిపోయాడు. ఈ ఘటన టర్కీలోని ఒస్మానియా ప్రావిన్స్‌లో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీటీవీలో రికార్డయ్యాయి. ఈ క్రమంలో ఆ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

కాగా వీడియోలో కనిపించిన వ్యక్తిని సాదిక్‌ కొకడాలిగా గుర్తించారు. ఘటన అనంతరం అతడు మాట్లాడుతూ.. తాను క్షేమంగానే ఉన్నానని చెప్పాడు. గాలులను తట్టుకుని నిలబడేందుకు స్టాండ్‌ ఉన్న గొడుగు సాయం తీసుకున్న క్రమంలో దాంతో పాటు తాను కూడా పైకి ఎగిరిపోయానన్నాడు. నాలుగు మీటర్ల ఎత్తుకు చేరిన తర్వాత భయంతో కిందకి దూకేశానని తెలిపాడు. ఇక ఈ ఘటనలో కొకడాలికి ఎటువంటి గాయాలు కాకపోవడం విశేషం.