జనసేన ఆరవ జాబితా ఇదే …  వీళ్ళే ఆ 16 మంది అభ్యర్థులు
Spread the love

నామినేషన్లకు డెడ్ లైన్ సమీపిస్తుండటంతో ఎపీలోని రాజకీయ వర్గాలు అభ్యర్థుల ప్రకటన వేగవంతం చేశాయి. ఈ క్రమంలో బీజేపీ 23 మంది పార్లమెంట్ అభ్యర్థులను, 51మంది అసెంబ్లీ అభ్యర్థులను ప్రకటన చేస్తే జనసేన మాత్రం ఇంకా అభ్యర్ధులను విడతలవారీగా ప్రకటిస్తుంది. ఈ క్రమంలో ఆరవసారి అభ్యర్ధుల లిస్ట్‌ను విడుదల చేసిన జనసేన.. 16మంది అభ్యర్ధులను ప్రకటించింది . ఇప్పటివరకు తొలి విడత లో 32, రెండో విడత లో 32, మూడో విడతలో 16, నాలుగో విడతలో 8, ఐదో విడతలో 16, ఇలా ఐదు విడతలు విడుదల చేయగా.. తాజా లిస్ట్‌లో 16మందికి చోటు ఇచ్చారు. జనసేన మొత్తం 140స్థానాల్లో పోటీ చెయ్యనుంది . 25వ తేదీ నామినేషన్‌లకు చివరి రోజు కావడంతో మిగిలిన అభ్యర్ధులను కూడా వీలైనంత త్వరగా ప్రకటించే యత్నంలో ఉంది .

నసేన అభ్యర్ధుల ఆరవ జాబితా అభ్యర్థులు ఎవరంటే

జగ్గయ్య పేట – ధరణికోట వెంకటరమణ

గుడివాడ – రఘునందన్ రావు

పొన్నూరు – బోని పార్వతి నాయుడు

గురజాల – చింతలపూడి శ్రీనివాస్నం

ద్యాల – సజ్జల శ్రీధర్ రెడ్డి

మంత్రాలయం – బోయ లక్ష్మణ్

రాయదుర్గం – మంజునాథ గౌడ

తాడిపత్రి – కదిరి శ్రీకాంత్ రెడ్డి

కళ్యాణదుర్గం – కరణం రాహుల్

రాప్తాడు – సాకె పవన్ కుమార్

హిందూపురం – ఆకుల ఉమేష్

పులివెందుల – తుపాకుల చంద్రశేఖర్

ఉదయగిరి – మారెళ్ల గురు ప్రసాద్

చంద్రగిరి – శెట్టి సురేంద్ర

సూళ్లూరుపేట – ఉయ్యాల ప్రవీణ్

పీలేరు – బి. దినేష్