ఎన్టీఆర్ బ‌యోపిక్‌లో ఇదే హైలైట్‌ సీన్…!
Spread the love

మొన్నటి వరకు సినిమాలు డిఫెరెంట్ జోనర్స్ లో వచ్చినట్లు ఇప్పుడు బయోపిక్ ఫార్మాట్ లో వస్తుండడం చెప్పుకోదగ్గ విషయం. సావిత్రి సినిమా ఎప్పుడైతే మంచి సక్సెస్ అయ్యిందో దైర్యంగా నిజ జీవిత కథలను చూపించవచ్చని సినిమా వాళ్లు ఆరాటపడుతున్నారు. బాలకృష్ణ అదే తరహాలో ఇటీవల ఎన్టీఆర్ సినిమా పనులను వేగవంతం చేసిన సంగతి తెలిసిందే. విశ్వ‌విఖ్యాత న‌ట‌సార్వ‌భౌమ ఎన్టీఆర్ బ‌యోపిక్‌కి సంబంధించిన స‌న్నాహాలు సాగుతున్న‌ సంగ‌తి తెలిసిందే.

ఇక దర్శకుడు తేజ తప్పుకోవడంతో బాలయ్య తనకు 100వ సినిమాతో జీవితంలో గుర్తిండిపోయే హిట్ ఇచ్చిన క్రిష్ ను లైన్ లో పెట్టాడు. తేజ స్థానంలో ద‌ర్శ‌కుడిగా క్రిష్‌ని ఎంపిక చేశార‌న్న‌ది తాజా అప్‌డేట్‌. దాదాపు ఆయనకే ఆవకాశం దక్కినట్లే అని తెలుస్తోంది. అలాగే బయోపిక్ లో కీలకమైన చంద్రబాబు పాత్రకు రానాను ఫిక్స్ చేశారు. రీసెంట్ గా స్క్రిప్ట్ విన్న రానా సింగిల్ సిట్టింగ్ లో గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడట. ఎన్టీఆర్ పాత్రలో బాలయ్య కనిపిస్తున్న సంగతి తెలిసిందే.. ఇక విద్యా బాలన్ బసవతారకం క్యారెక్టర్ కి రీసెంట్ గా ఒప్పుకున్నారు. ఈ సినిమాకి సంబంధించిన మ‌రిన్ని హాట్ అప్‌డేట్స్ అంత‌ర్జాలంలో లీక‌య్యాయి.

ఆ వివ‌రాల ప్ర‌కారం… సినిమాలో తొలి 40 నిమిషాలు ఎన్టీఆర్ పాత్ర‌లో శర్వానంద్ ని ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. అయితే ఎన్టీఆర్ యువకుడిగా ఉన్నప్పుడు కొంచెం సన్నగా ఉండేవారు. ఆ ఏజ్ మాదిరిగా బాలయ్య కనిపించాలి అంటే కష్టం. సన్నాబడాలని ట్రై చేసినా కూడా సమయం సరిపోదు. అందుకే శర్వానంద్ ని ఒకే చేసినట్లు సమాచారం. అలానే నిమ్మ‌కూరులో నూనూగు మీసాల ఎన్టీఆర్ ల‌వ్‌స్టోరి సినిమాకే హైలైట్‌గా ఉంటుంద‌ని స‌మాచారం.

ఎన్టీఆర్ యుక్త‌వ‌య‌సులో ఉన్న‌ప్పుడు నిమ్మ‌కూరులో త‌మ ఇంటికి వ‌చ్చి పాలు పోసే అమ్మాయికి లైనేసేవార‌ట‌. ఆ క్ర‌మంలోనే ఎన్టీఆర్ త‌ల్లిదండ్రులు బ‌స‌వ‌తార‌కంని ఇచ్చి పెళ్లి చేశారు. వాస్త‌వానికి ఆ పెళ్లి ఎన్టీఆర్ ఇష్టానికి విరుద్ధంగా జ‌రిగింది. అయితే పెళ్లి త‌ర‌వాత తార‌క‌రాముడు భార్య‌ను ఎంత‌గానో ప్రేమించారు. ప్ర‌తి ఒక్క‌రి జీవితంలో ఎంతో మెలోడ్రామా, వాస్త‌విక‌త ఉంటుంది. అలాంటి వాస్త‌వాల్ని య‌థాత‌ధంగా చూప‌డం ద్వారా ప్రేక్ష‌కాభిమానుల్లో ఎమోష‌న్ పెంచాల‌ని న‌ట‌సింహా బాల‌కృష్ణ ఎలాంటి జంకూ లేకుండా ఈ స్క్రిప్టును తీర్చిదిద్దార‌ని చెబుతున్నారు. ఈ సినిమాని బాల‌కృష్ణ‌ ఎంతో ప్ర‌తిష్ఠాత్మ‌కంగా నిర్మిస్తున్నారు.