విశాఖ బీచ్‌లో జనసేన ఆధ్వర్యంలో స్వచ్ఛభారత్
Spread the love

విశాఖ బీచ్‌లో జనసేన పార్టీ ఆధ్వర్యంలో స్వచ్ఛభారత్ జరిగింది. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ ఎంపీ అభ్యర్థి లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యే అభ్యర్ధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తీరంలో వ్యర్ధాల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు. అలాగే ప్లాస్టిక్ వస్తువుల బహిష్కరణపై ప్రజల్లో అవగాహన అవసరమన్నారు. ముంబైలో జూహూ బీచ్ క్లీనింగ్ బ్యాచ్ తరహాలో విశాఖలో విద్యార్ధులతో క్లబ్ ఏర్పాటుతో మంచి ఫలితాలు చూడొచ్చునని లక్ష్మీనారాయణ వ్యాఖ్యానించారు.