లవ్ జిహాద్:  సుప్రీంకోర్టు సూపర్  ట్విస్ట్ ఇచ్చి౦ది
Spread the love

ప్రస్తుత సమాజ౦ లో   ముస్లిం యువకుల హిందూ మహిళలను వివాహం చేసుకునేందుకు ప్రేమ పేరుతో వలవేస్తున్నారని `లవ్ జిహాద్`గా పిలవబడే ఈ కుట్రలో బలి అవద్దంటూ హిందుత్వ వాదుల ఎప్పటి ను౦చో  సూచనలు ఇస్తున్నాయి – తమ నిజమైన ప్రేమకు మతం రంగు పులమవద్దంటూ ముస్లిం యువత వాదోపవాదాల పర్వం కొనసాగుతుండగానే..ఇటీవలే ఓ ఉదంతం దేశం చూపును తనవైపు తిప్పుకొన్న సంగతి మన  అ౦దరికి  తెలిసిందే. ఇలాంటి  లవ్ జిహద్   ప్రేమ పెళ్లి ఉదంతంలో మతాన్నే మార్చుకొని వచ్చి అమ్మాయిని పెళ్లి చేసుకున్న ముస్లిం యువకుడికి ఎదురుదెబ్బ తగిలిందనే చెప్పాలి. భర్త చెంతకు వెళ్లేందుకు భార్య నిరాకరించింది. తల్లిదండ్రుల వద్దే ఉంటానని సోమవారం సుప్రీంకోర్టు ధర్మాసనం ఎదుట స్పష్టంచేసింది. దీంతో ఈ  ప్రేమ కథ అడ్డం తిరిగింది.

 

ఈ  స౦వత్సర౦  ఫిబ్రవరిలో ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలోని రాయ్ పూర్ కు చెందిన 23 ఏళ్ల హిందూ యువతిని వివాహం చేసుకునేందుకు 33 ఏళ్ల ఓ ముస్లిం యువకుడు హిందూమతాన్ని స్వీకరించాడు. ఆర్యన్ ఆర్యగా పేరు మార్చుకుని ఆమెకు తాళికట్టాడు ఏడు అడుగులు నడిచాడు. అయితే అనంతరం అతడి అసలు రంగు బయటపడింది. అప్పటికే ఆయనకు రెండు పెళ్లిల్లు అయ్యాయి. ఆ అమ్మాయిపై వల వేసి పెళ్లి చేసుకున్నాడని తెలిసి౦ది. దీంతో ఆమె తల్లిదండ్రులు తమ బిడ్డకు నచ్చచెప్పి భర్తకు దూరంగా ఉంచారు. అయితే యువతి తల్లిదండ్రులు – హిందూ సంఘాలు తమను బలవంతంగా విడదీశాయని ఆరోపిస్తూ ఆ  యువకుడు.. ఈ నెల 17న సుప్రీంకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశాడు. దీనిపై ధర్మాసనం వాదనలు స్వీకరించడ౦ జరిగి౦ది. యువతి మేజర్ కావడ౦ వలన  నిర్ణయాలు తీసుకొనే స్వేచ్ఛ ఆమెకు ఉన్నదని తాను  తన౦తట తానే ఇష్టపూర్వకంగానే పెళ్లి  చేసుకున్నానని యువతి చెప్పిందని ధర్మాసనం పేర్కొంది. ఒకవేళ ఆమె తన భర్త వద్దకు వెళ్లేందుకు ఆసక్తి చూపకపోతే అది వివాహసంబంధమైన కేసు అవుతుందని దీనిపై సంబంధిత కోర్టు తీర్పు ఇస్తుందని చెప్పి౦ది.  రెండుసార్లు వివాహమై విడాకులు తీసుకున్న విషయాన్ని దాచి అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడని ఛత్తీస్గఢ్ ఏజీ జుగల్ కిశోర్ గిల్డా న్యాయస్థానానికి తేలియజేసారు. ఇరుపక్షాల వాదనల అనంతరం న్యాయమూర్తి ఆ అమ్మాయి అభిప్రాయాన్ని కోరగా..తను ముస్లిం యువకుడి చేతిలో మోసపోయానని పేర్కొంటూ తల్లిదండ్రలతోనే కలిసి ఉంటానని వెల్లడించింది. దీంతో న్యాయస్థానం అందుకే సమ్మతించింది.