హైపర్ ఆదికి వార్నింగ్ ఇచ్చిన శ్రీరెడ్డి
Spread the love

టాలీవుడ్‌ యంగ్‌ కమెడియన్‌ హైపర్ ఆది.. మహిళల్ని అగౌరవ పరిచేలా పిచ్చి పిచ్చి స్కిట్‌లు చేస్తే చెప్పుతీసుకుని చావగొడతా అంటూ ఫేస్‌బుక్‌లో హైపర్ ఆదికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది శ్రీరెడ్డి. బుల్లితెరపై ప్రసారం అయ్యే జబర్దస్త్ కామెడీ షోలో తననూ తన నిరసనకు కించపరుస్తూ కామెంట్ చేశారని ఆదిపై ఫైర్ అయ్యింది శ్రీరెడ్డి. ముందుగా ఆదిపై ప్రశంసలు గుప్పించినట్లే గుప్పించిన ఆమె.. తర్వాత తీవ్ర వ్యాఖ్యలకు దిగారు. తరిమి తరిమి కొడతానంటూ, తాట తీస్తానంటూ హెచ్చరించారు. ఈ సందర్భంగా ఫేస్‌బుక్‌లో తనదైన శైలిలో రెచ్చిపోయింది శ్రీరెడ్డి.

‘ఆది గారూ.. మీ మీద నాకు ఎలాంటి కోపం లేదు. మీరు మంచి రచయిత. మీ పొట్టకూటిని చూసుకుంటూనే మరికొందరికి లైఫ్‌ కూడా ఇస్తున్నారు. ఆ విషయంలో నేను అభినందిస్తున్నా. కానీ, మీ పద్ధతి బాగోలేదు. గతంలో మీరు చేస్తున్న అదే షోలో కొన్ని కులాల గురించి, కొందరి గురించి కించపరిచేలా మాట్లాడారంటూ కొందరిని వెంటపడి మరీ కొట్టిన ఘటనలు మీకు గుర్తుండే ఉంటాయనుకుంటా. అలాగని ఎవరో వచ్చే దాకా ఎదురు చూసే రకాన్ని నేను కాదు. వెంటపడి తరిమి తరిమి కొడతా. హైపర్‌ ఆది నీ తాట తీస్తా. మహిళలపై సమాజంలో ఇప్పుడిప్పుడే కాస్త గౌరవం పెరుగుతోంది. ఇలాంటి సమయంలో నువ్వు కించపరిచే కామెంట్లు చేస్తే ఊరుకోను’ అని ఆమె హెచ్చరించారు.

ఘాటు వ్యాఖ్యలు… నన్ను ఉద్దేశించి పెయిడ్ ఆర్టిస్ట్‌లు అంటూ జబర్దస్త్ లో పంచ్‌లు వేశారు. తాను చేసిన నిరసన దీక్షను ఆది తక్కువ చేసి మాట్లాడాడని, ‘షర్ట్‌ విప్పరా.. ఇంటర్నేషనల్‌ మీడియా కవర్‌ చేస్తుంది’ ఓ డైలాగ్‌ చెప్పాడని ఆమె తెలిపారు . ‘నేను తెలిపింది నిరసన.. అది సెక్సీ నెస్‌ కాదు. ఆది.. నీ పుట్టుకకు అవమానం తీసుకురాకు… అంటూ ఘాటు పదజాలమే వాడారామే. తల్లిగా, చెల్లిగా, భార్యగా మగాడి జీవితంలో పాత్రలు పోషించే మహిళలపై టీవీషో అడ్డుపెట్టుకుని జోకులేయొద్దని, అలా కాదు అని ఇదే కొనసాగితే వంద చెప్పులు నీ మీద వచ్చి పడతాయి’ అని ఆదిని ఉద్దేశించి ఆమె వ్యాఖ్యానించారు.

గతంలో ఓ ప్రముఖ హీరో గురించి మాట్లాడిన కత్తి మహేష్‌ పైకూడా ఆది ఇదే షోలో సెటైర్లు వేసిన విషయాన్ని ఆమె ప్రస్తావనకు తీసుకొచ్చారు. ఇక ఆది పేల్చే పిచ్చి జోకుల వెనుక ఆ షో న్యాయనిర్ణేత నాగబాబు ప్రమేయం గనుక ఉంటే మాత్రం.. రాజకీయంగా ప్రభావం చూపుతుందని ఆమె హెచ్చరించారు. మహిళలను కించపరిచే డైలాగులపై ఎందుకు ఉపేక్షిస్తున్నారంటూ షో నిర్వాహకులను కూడా ఆమె నిలదీశారు.