ఈవెంట్‌ నిర్వాహకుడిపై సోనాక్షి సిన్హా ఆరోపణ  !
Spread the love

ఈవెంట్‌లో పాల్గొనేందుకు డబ్బులు తీసుకుని చివరి నిమిషంలో హాజరయ్యేందుకు నిరాకరించారంటూ ఓ ఈవెంట్‌ నిర్వాహకుడి ఫిర్యాదుతో బాలీవుడ్‌ నటి సోనాక్షి సిన్హా సహా మరో నలుగురిపై చీటింగ్‌ కేసు దాఖలైన సంగతి తెలిసిందే. ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం ఈవెంట్‌లో పాల్గొనేందుకు చెల్లించాల్సిన మొత్తానికి సంబంధించి పలుమార్లు గుర్తుచేసినా నిర్వాహకులు సోనాక్షికి డబ్బు చెల్లించకపోవడంతో పాటు చివరికి తప్పుడు ప్రచారం చేస్తుందని సోనాక్షి సిన్హా ఏజెన్సీ ఓ ప్రకటనలో పేర్కొంది.

ఈవెంట్‌ను మరోసారి నిర్వహించడంతో పాటు ప్రత్యామ్నాయ మార్గాలపై పలుసార్లు నిర్వాహకులతో తాము కోరినా వారి నుంచి స్పందల లేదని సోనాక్షి మేనేజ్‌మెంట్‌ టీం ఆవేదన వ్యక్తం చేసింది.తాము ఎన్ని సార్లు గుర్తు చేసినా సోనాక్షికి ముందుగా చెల్లించాల్సిన మొత్తం చెల్లించలేదని, నిర్వాహకులు స్పందించకపోవడంతో సోనాక్షి, ఆమె బృందం ముంబై ఎయిర్‌పోర్ట్‌ నుంచి వెనుతిరిగిందని సోనాక్షి ప్రచార వ్యవహారాలు పర్యవేక్షించే ఏజెన్సీ పేర్కొంది.