భారత్‌లో యుహో  మొబైల్స్‌ ప్లాంట్‌
Spread the love

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: స్మార్ట్‌ఫోన్ల తయారీలో ఉన్న చైనా కంపెనీ యుహో మొబైల్‌… భారత్‌లో తయారీ కేంద్రం ఏర్పాటు చేయనుంది. తిరుపతి లేదా హరియాణాలోని గురుగ్రామ్‌లో ఈ యూనిట్‌ను నెలకొల్పనుంది. ఇందుకు రూ.100 కోట్లు వెచ్చిస్తామని కంపెనీ సేల్స్‌ డైరెక్టర్‌ కేశవ్‌ అరోరా చెప్పారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ మార్కెట్లో యుహో వాస్ట్‌ ప్లస్‌ మోడల్‌ను సినీ నటి సిమ్రాన్‌ చౌదరితో కలిసి విడుదల చేసిన సందర్భంగా బుధవారమిక్కడ మీడియాతో మాట్లాడారు.

ఎక్కడ ప్లాంటును స్థాపించేదీ 3 నెలల్లో నిర్ణయిస్తామన్నారు.  గురుగ్రామ్‌లో అసెంబ్లింగ్‌ యూనిట్‌ ఉందని, కొత్త ప్లాంటులో ఈ ఏడాదే ఉత్పత్తి కార్యకలాపాలు మొదలవుతాయని చెప్పారు. శ్రీలంక, నేపాల్, బంగ్లాదేశ్‌ వంటి మార్కెట్లకు ఇక్కడి నుంచే ఎగుమతి చేస్తామన్నారు. 2019లో యుహో మొబైల్స్‌ కొత్త మోడళ్లను ప్రవేశపెట్టనుంది.