ప్రాణాలతో చెలగాటమాడిన శింబు అభిమాని, క్రేన్‌‌కు వేలాడుతూ!
Spread the love

తమిళ స్టార్ హీరో శింబుకు తమిళనాడు లో మంచి క్రేజ్ ఉంది . అతడి సినిమాలు అక్కడ విజయం సాధించినా, నిరాశపరిచిన శింబుని అభిమానించేవారు పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. శింబు నటించిన మణిరత్నం చిత్రం చెక్కా చివంత వానం చిత్రం ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సూపర్ హిట్ టాక్ తో విజయపథంలో దూసుకుపోతోంది. శింబు నటించిన సినిమాల విడుదల సందర్భంగా అభిమానులు హంగామా చేయడం సాధారణమే. కానీ ఓ అభిమాని ప్రాణాలతో చెలగాటమాడుతూ చేసిన విన్యాసం విమర్శలకు తావిస్తోంది. మణిరత్నం చాలా కాలం తరువాత ఓ పవర్ ఫుల్ స్టోరీతో వచ్చాడు. ఆయన తెరకెక్కించిన చెక్క చివంత వానం చిత్రంలో శింబు నటనకు అద్భుతమైన స్పందన వస్తోంది.

ఈ చిత్ర విడుదల సందర్భంగా శింబు అభిమాని చేసిన సాహసం ఒళ్ళు గగుర్పొడిచేలా ఉంది. ఈ ఘటన వేలూరులో జరిగినట్లు తెలుస్తోంది. ఈ చిత్రం విడుదల సందర్భంగా అభిమాని ఒకరు శింబు కటౌట్ కు పాలాభిషేకం చేయడానికి ప్రాణాలతో చెలగాటమాడుతూ కనిపించాడు.థియేటర్ ముందు ఉంచి శింబు భారీ కటౌట్ కు పాలాభిషేకం చేయడానికి అభిమాని ఒకరు క్రేన్ కు వేలాడుతూ కనిపించాడు. క్రేన్ కు వేలాడుతూ కటౌట్ పైకి చేరుకొని పాలాభిషేకం చేశాడు. కింద అభిమానులు డప్పులు వాయిస్తూ పెద్దఎత్తున సంబరాలు చేశారు.ఈ ఘటనపై పలువురు నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనిపై శింబు స్పందించాలి ఉంది. శింబు ప్రస్తుతం అత్తారింటికి దారేది రీమేక్ లో నటిస్తూ బిజీగా ఉన్నాడు.