5 వేలకే 32 అంగుళాల స్మార్ట్‌ టీవీ
Spread the love

మార్కెట్లో అతితక్కువ ధరకే స్మార్ట్‌ టీవీలను అందించనున్నట్టు సామీ ఇన్ఫర్మేటిక్స్ డైరెక్టర్ అవినాష్ మెహతా ప్రకటించారు. ఇతర వర్గాలతో పాటు తక్కువ ఆదాయ కుటుంబాలను వారిని లక్ష్యంగా పెట్టుకుని ఈటీవీని లాంచ్‌ చేసినట్టు చెప్పారు.

ఢిల్లీకి చెందిన సామీ ఇనఫర్మేటిక్స్‌ అనే సంస్థ కేవలం రూ.5వేలకే 32అంగుళాల ఆండ్రాయిడ్‌ ఎల్‌ఈడీ స్మార్ట్‌టీవీని తీసుకొచ్చింది. ఢిల్లీలో బుధవారం జరిగిన ఒక కార్యక్రమంలో సామీ టీవీని ఆవిష్కరించింది. దీని ధర రూ.4999గా నిర్ణయించింది.

ప్రస్తుతం మార్కెట్‌లో లభిస్తున్న ఎల్‌ఈడీ ఆండ్రాయిడ్‌ స్మార్ట్‌టీవీల్లో ఉన్నఅన్ని ఫీచర్లను అందిస్తోంది. 512జీబీ స్టోరేజ్‌‌, 4జీబీ ర్యామ్‌,1366×786 హెచ్‌డీ పిక్సెల్స్‌ రిజల్యూషన్‌, 10వాట్స్‌ స్పీకర్స్‌, (ఎస్‌ఆర్‌ఎస్‌​ డాల్బీ డిజిటల్‌, 5 బ్యాండ్‌) ఇన్‌బిల్ట్‌ వైఫై కనెక్టివీటీ, స్క్రీన్‌ మిర్రరింగ్‌తోపాటు ఫేస్‌బుక్‌, యూ ట్యూబ్‌ లాంటి యాప్స్‌ను కూడా అందిస్తోంది.