ఆ విషయంలో ‘సారీ’ చెప్పిన సమంత
Spread the love

సమంత అక్కినేని, రాహుల్ రవీంద్రన్, ఆది పినిశెట్టి ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా యూ టర్న్. సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. థ్రిల్లర్ జానర్ లో సమంతా జర్నలిస్ట్ గా నటిస్తుంది. శుక్రవారం ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయింది. ఈ సినిమాకు సమంత డబ్బింగ్ చెప్పడం విశేషం. కాకపోతే సమంతా డబ్బింగ్ చెప్పడం గురించే చాలా కామెంట్స్ వచ్చాయి. ఇప్పటి దాకా సమంత కు తెరవెనుక డబ్బింగ్ చెప్పిన చిన్మయి గొంతులోని మేజిక్ వల్లే తన యాక్టింగ్ బాగా ఎలివేట్ అయ్యి మంచి పేరు తెచ్చింది. కానీ యుటర్న్ లో మాత్రం తనే స్వంతంగా డబ్బింగ్ చెప్పేందుకు పూనుకోవడం పట్ల ఫ్యాన్స్ మొదట సంతోషించినా ట్రైలర్ చూసాక మాత్రం కాస్త నిరుత్సాహం చెందారు.

ప్రస్తుతం ఈ డబ్బింగ్‌పై సోషల్ మీడియాలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆమె వాయిస్ అంతగా సూట్ అవలేదని.. పేలవంగా ఉందని టాక్ వినిపిస్తోంది. ట్విటర్ ద్వారా ఓ అభిమాని డబ్బింగ్ విషయంలో కేర్ తీసుకోమని సలహా ఇచ్చారు. దీనికి సామ్ చాలా పాజిటివ్‌గా రెస్పాండ్ అయింది. ‘‘సమంత మూవీ బ్లాక్ బస్టర్ అవుతుందని ఆశిస్తున్నా. సినిమా రిలీజ్ అయిన తర్వాత మీ డబ్బింగ్‌కు కూడా మంచి రివ్యూస్ వస్తాయని భావిస్తున్నా. యూ టర్న్ డబ్బింగ్ విషయంలో జాగ్రత్త తీసుకోండి’’ అని ట్వీట్ చేశారు. దీనికి సమంత ‘‘డబ్బింగ్‌ను సరి చేస్తున్నాం. దానికి సారీ’’ అని చెప్పింది. ఒకరు చెప్పిందాన్ని ఇంత పాజిటివ్‌గా రిసీవ్ చేసుకోవడమే కాకుండా సారీ కూడా చెప్పిన ఆమె వ్యక్తిత్వాన్ని చూసి అభిమానులు ఫిదా అవుతున్నారు.