వైరల్‌ అవుతోన్న సమంత ఫొటోలు
Spread the love

‘ఎప్పుడూ నిశ్శబ్దంగా ఉండే నా శ్రీవారు జీవితాంతం అలాగే ప్రశాంతంగా బతకాలని ఆశపడ్డారు. కానీ దేవుడు మాత్రం నన్ను పంపించి ప్రతీకారం తీర్చుకున్నాడు’ అంటూ తన భర్త నాగచైతన్యతో కలిసి దిగిన క్యూట్‌ ఫొటోను సమంత ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారు.  టాలీవుడ్‌ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్‌ పెద్ద కూతురు ఆశ్రిత వివాహం జైపూర్‌లో వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. గత నెలలో జరిగిన ఈ వేడుకకు వెంకటేష్‌ మేనల్లుడు చైతన్య తన భార్య సమంతతో సహా హాజరై సందడి చేశాడు.

samantha shares adorable pics naga chaitanya and daggubati family

కాగా ఇందుకు సంబంధించిన ఫొటోలను సమంత ప్రస్తుతం సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. వెంకటేష్‌ దంపతులతో పాటు వారి కూతుళ్లు హవ్యవాహిని, ఆశ్రిత, భావనలతో కలిసి దిగిన ఫొటోను పోస్ట్‌ చేసిన సమంత..  ఫేవరెట్‌ పిక్స్‌ అంటూ ఇతర కుటుంబ సభ్యులతో దిగిన మరిన్ని ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు. ఫ్యామిలీ టైమ్‌ను ఎంజాయ్‌ చేస్తూ.. భర్తను ఆటపట్టిస్తున్న సమంత ఫొటోలకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. లక్షల కొద్దీ లైకులు కొట్టి సామ్‌పై తమకున్న అభిమానాన్ని చాటుకుంటున్నారు.