సాక్షి…. ధోనీపై మీ ఫస్ట్ ఇంప్రెషన్ ఏంటి?
Spread the love

సాక్షి ధోనీ.. క్రికెట్‌ అభిమానులకు పరిచయం చేయలేని పేర్లు. భారత క్రికెట్‌ జట్టు మాజీ సారథి మహేంద్ర సింగ్‌ ధోనీ అభిమానులందరూ తనను ఎంతగా అభిమానిస్తారో.. సాక్షిని కూడా అలాగే  అభిమానిస్తారు. కొద్ది రోజుల క్రితం సాక్షి తన కూతురు జీవాను తీసుకుని ఇంగ్లాండ్‌ వెళ్లింది. మీడియాకు, అభిమానులకు దూరంగా ఉండే ఆమె తాజాగా ఇన్‌స్టాగ్రాం ద్వారా అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. ఈ క్రమంలో ఓ అభిమాని ధోనీ పై మీ ఫస్ట్‌ ఇంప్రెషన్‌ ఏంటి అని సాక్షిని  ప్రశ్నించాడు. అంతేకాదు అభిమానులు అడిగిన ప్రతి ప్రశ్నకు సాక్షి ఎలా సమాధానం ఇచ్చారో చూద్దాం….

* ప్రస్తుతం మీరు ఎక్కడ నివాసముంటున్నారు?

సాక్షి:  రాంచి… చిన్న పట్టణాలు అంటే మాకు చాలా ఇష్టం.

* మేడమ్‌.. ఏదైనా మ్యాచ్‌లో ధోనీ తన ఫినిషింగ్‌ షాట్‌ను హెలికాప్టర్ షార్ట్‌తో ముగిస్తే మీరు ఎలా ఫీలవుతారు?

సాక్షి:  అభిమానులు ఎలా ఫీలవుతారో… నేను అంతే.

* ధోనీపై మీ ఫస్ట్‌ ఇంప్రెషన్‌ ఏంటి?

సాక్షి:  సింపుల్‌. ఎంత ఎదిగినా ఒదిగి ఉంటాడు.

* మీరు క్రికెట్‌ ఆడతారా?

సాక్షి:  లేదు.

* జీవాకు ఇష్టమైన ఫేవరెట్‌ కార్టూన్‌ క్యారెక్టర్‌ ఏంటి?

సాక్షి:  మోగ్లీ, బగీరా.

* సెలబ్రెటీ లైఫ్‌కు అలవాటుపడ్డారా? ఏమైనా కష్టంగా ఉందా?

సాక్షి:  ఆ లైఫ్‌కు నేనింకా అలవాటుపడలేదు.

* మీ టూత్‌ పేస్టులో ఉప్పు ఉందా?

సాక్షి:  ఉంది.

* ధోనీ-జీవా.. వీరిద్దరిలో ఎవర్ని హ్యాండిల్‌ చేయడం కష్టంగా ఫీలవుతారు?

సాక్షి:  ఎలాంటి కష్టం లేదు. ఇద్దరూ సహకరిస్తారు.

* మీకు చెన్నై అంటే ఇష్టమా?

సాక్షి:  ప్రేమ.