డ్రైవర్‌ లేని రైలు ప్రయాణం .. చివరికేమైందో చూడండి ?
Spread the love

ఇనుప ఖనిజాన్ని మోసుకెళ్తున్న ఓ భారీ గూడ్స్‌ రైలు బండి పట్టాలు తప్పడం జరిగింది. మైనింగ్‌ దిగ్గజం బీహెచ్‌పీ కంపెనీకి చెందిన గూడ్స్ రైలు డ్రైవర్‌ లేకుండా దాదాపు గంటసేపు ప్రయాణించడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుందని తెలుస్తుంది.అయితే వివరాలు ఇలా ఉన్నాయి . బీహెచ్‌పీకి చెందిన 268 – వాగన్‌ రైలు ఇనుప ఖనిజాన్ని మోసుకుని పశ్చిమ ఆస్ట్రేలియాలోని పోర్ట్‌ హెడ్‌ల్యాండ్‌కు ప్రయాణం ప్రారంభించింది. ప్రయాణం మధ్యలో తనిఖీ చేయడం కోసం డ్రైవర్‌ తన క్యాబిన్‌ నుంచి దిగాడు. అయితే ఆ సమయంలో రైలు ఆటోమెటిగ్గా పట్టాలు తప్పి.. గంట సేపు దాదాపు 110 కిలోమీటర్ల దూరం ప్రయాణించింది. అయితే ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం సంభవించలేదు కానీ కొన్ని రైళ్లు, 1,500 మీటర్ల పొడవైన రైల్వే ట్రాక్‌ దెబ్బతిన్నదని సమాచారం. ప్రస్తుతం బీహెచ్‌పీ సిబ్బంది ఈ ట్రాక్‌ను బాగు చేసే పనిలో ఉన్నారు.