కంగనా రనౌత్‌పై ముంబైలో పోలీస్‌ కేసు
Spread the love

బాలీవుడ్‌ కథానాయిక కంగనా రనౌత్‌ చుట్టూ ఎప్పుడూ వివాదాలు ఉంటూనే ఉంటాయి. ఏదో ఒక విషయంలో ఆమె తరచూ వార్తల్లో నానుతూనే ఉంటారు. తాజాగా ముంబైలో ఆమె పై పోలీస్‌ కేసు నమోదు అయింది. వివరాల్లోకి వెళితే గత ఏడాది కంగనా 20 కోట్లు పెట్టి ముంబై పాలీహిల్‌లో ఒక బంగ్లాను కొనుగోలుచేసింది. ఈ డీల్ సెట్ చేసినందుకుగాను ఒక రియల్ ఎస్టేట్ బ్రోకర్ కు ఆమె పెర్సెంటేజ్ చెల్లించాల్సి ఉంది. ఇప్పటికే ఆమె 20 కోట్లలో ఒక శాతం అనగా 20 లక్షలు చెల్లించారు. కానీ బ్రోకర్ మాత్రం తనకు 2 శాతం పెర్సెంటేజ్ రావాల్సి ఉందని, కానీ కంగనా మిగిలిన 1 శాతం చెల్లించడంలేదని పోలీసులకు పిర్యాధు చేశారు. దీనిపై స్పందించిన కంగనా మాత్రం కొనుగోలు సమయంలో 1 శాతం మాత్రమే పెర్సెంటేజ్ మాట్లాడుకొన్నామని, ఆ మొత్తాన్ని ఎప్పుడో చెల్లించానని, అందుకు సంబంధించిన డాక్యుమెంట్లు కూడ కూడా తమ దగ్గర ఉన్నాయనీ, ఇప్పుడాయన అత్యాశతో 2% డిమాండ్‌ చేస్తున్నారని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం క్రిష్‌ దర్శకత్వం వహిస్తున్న ‘మణికర్ణిక’ చిత్రంలో నటిస్తున్నారు కంగన. విజయేంద్ర ప్రసాద్‌ కథ అందించిన ఈ చిత్రం ఝాన్సీ లక్ష్మీబాయ్‌ జీవితం ఆధారంగా రూపొందుతోంది.