మెగా ఫ్యామిలీ కల నేరవేరబోతుందా ??
Spread the love

మన టాలీవుడ్లో పేరు మోసిన ఫ్యామిలీస్ అంటే నందమూరి వారి కుటుంబం మెగా కాంపౌండ్ దగ్గుబాటి వారసులు మరియు అక్కినేని హీరోలు. వీళ్లు కేవలం యాక్టింగ్ మాత్రమే కాక అటు ప్రొడక్షన్ లో కూడా యాక్టీవ్ గానే ఉంటారు. ఇందులో మెగా ఫ్యామిలీ కి తప్ప వేరే ముగ్గురిలో ఉన్న కామన్ పాయింట్ స్టూడియో.

మూడు కుటుంబాలకు వారి సొంత స్టూడియోస్ ఉన్నాయి. నందమూరి వారికి రామకృష్ణ స్టూడియోస్ ఉన్నట్టు అక్కినేని వారికి అన్నపూర్ణ స్టూడియోస్ ఉంది. అలానే దగ్గుబాటి ఫ్యామిలీ కోసం రామానాయుడు స్టూడియోస్ ఉంది. అలానే ఘట్టమనేని వారికి కూడా పద్మాలయా స్టూడియోస్ ఉంది. కానీ మెగా ఫ్యామిలీ ఆధ్వర్యంలో మాత్రం అలాంటి స్టూడియో లేదు. కానీ ఇప్పుడు రాం చరణ్ వల్ల ఈ మెగా కల నెరవేరబోతోంది. హైదరాబాద్ పొలిమేరల్లో చిరు రాబోయే సినిమా సై రా షూటింగ్ బ్రేకుల్లేకుండా సాగుతోంది. ఆ 22 ఎకరాల నేలపై భారీ సెట్ వేసింది సై రా టీం.

ఈ సినిమాని నిర్మిస్తున్న రామ్ చరణ్ ఈ 22 ఎకరాల నేలపై ఒక స్టూడియోస్ ని నిర్మించాలని ఆలోచిస్తున్నాడు. ఈ రకంగా మెగా ఫ్యామిలీ కి ఎప్పటినుండో ఉన్న ఈ కల తీరినట్టే. ఇక మెగా హీరోలంతా ఎంచక్కా ఇక్కడే వారి సినిమాలు షూటింగులు చేసుకోవచ్చు. అంతే కాదండోయ్. ఈ రకంగా మెగా పవర్ స్టార్ కూడా చాలానే వెనకేసుకోవచ్చు. చూద్దాం మరి ఎన్నాళ్ళకి వీళ్ళ కల నెరవేరుతుందో.