ఎన్టీఆర్‌ను మ్యాచ్ చేస్తే 10 లక్షలు : రామ్ గోపాల్ వర్మ
Spread the love

ఈ మధ్య అచ్చంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని పోలిన ఓ వ్యక్తి ఓ హోటల్లో సర్వర్‌గా పని చేస్తున్న వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేయడం.. అది చూసి రామ్ గోపాల్ వర్మ తన ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాలో బాబు పాత్రకు అతడిని తీసుకుందామనుకోవడం.. ఆ వ్యక్తి వివరాల కోసం అప్పీల్ ఇవ్వడం.. తనకు సమాచారం ఇచ్చిన ఓ మీడియా వ్యక్తికి లక్ష రూపాయలు బహుమతి కూడా ప్రకటించడం తెలిసిన సంగతే. మరి సదరు వ్యక్తితో వర్మ మాట్లాడాడా.. అతడిని బాబు పాత్రకు ఓకే చేశాడా అన్నది వెల్లడి కాలేదు.

ఇదిలా ఉండగా.. ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ కీలకమైన ఎన్టీఆర్ పాత్రకు సరైన వ్యక్తిని కూడా ఇదే శైలిలో ఎంచుకోవాలని వర్మ ఫిక్సయ్యాడు. నిజానికి ఈ పాత్ర కోసం ఇప్పటికే ముగ్గురిని షార్ట్ లిస్ట్ చేశాడట. ఐతే తనకు ‘ది బెస్ట్’ కావాలని.. అందుకోసమే అప్పీల్ ఇస్తున్నానని.. రూపం, వాయిస్ విషయంలో ఎన్టీఆర్‌ను మ్యాచ్ చేసే వ్యక్తి కావాలని.. అలాంటి వ్యక్తి వీడియోను తనకు పంపితే.. దానికి తాను సంతృప్తి చెందితే రూ.10 లక్షలు ఇస్తానని వర్మ ప్రకటించాడు. ఏకంగా రూ.10 లక్షల బహుమతి అంటే జనాల నుంచి మంచి స్పందనే వచ్చే అవకాశముంది. మరి వర్మ సినిమాలో ఎన్టీఆర్ పాత్రధారి కూడా ఈ మార్గంలోనే సెట్టవుతాడేమో చూడాలి.