మహిళలకు రక్షణ లేదు : రకుల్‌ ప్రీత్‌ సింగ్‌
Spread the love

స్టార్‌ హీరోయిన్‌ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు ఒక ఆకతాయి ద్వారా సోషల్‌ మీడియాలో ఇబ్బందులు ఎదుర్కోంది. రకుల్ కారునుంచి దిగుతున్న ఫోటోను తన సోషల్‌ మీడియా పేజ్‌లో పోస్ట్ చేసిన ఓ వ‍్యక్తి అసభ్యకర కామెంట్స్ చేశాడు.

ఈ పోస్ట్ రకుల్‌ దృష్టికి వెళ్లటంతో ఆమె స్పందిస్తూఇలాంటి మనుషులు ఉన్నంత వరకు మహిళలకు రక్షణ లేదంటూ ఆవేదన వ్యక్తం చేసింది. కేవలం సమానత్వం, రక్షణ అంటూ చర్చలు జరపటం వల్ల ఉపయోగం లేదంటూ కామెంట్ చేసింది రకుల్‌.

అయితే రకుల్‌ ఇచ్చిన సమాధానంపై కూడా భిన్న వాదనలువినిపిస్తున్నాయి. కొందరు నెటిజన్లు రకుల్ ధైర్యాన్ని అభినందిస్తుంటే.. మరికొందరునీపై వచ్చిన కామెంట్స్‌కు కౌంటర్‌ ఇచ్చేందుకు నువ్వు కూడా ఓ మహిళనే అవమానించావ్‌ అంటూ సెటైర్స్‌ వేస్తున్నారు.మీరు ఆ వ్యక్తిని ఏమైనా అనండి. కానీ అతడి తల్లిని దూషించడం మహిళలను మీరే కించపరిచినట్టు అవుతుందని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. మరికొందరైతే రకుల్ మీ అమ్మ కూడా నీకు ఓ చెంపదెబ్బ ఇస్తుందని ట్వీట్లు చేస్తున్నారు.