‘పేట’ తెలుగు ట్రైలర్: చూస్తావుగా ఈ కాళీ ఆడించే ఆట…
Spread the love

సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘పేట’. ఈ చిత్రంలో రజినీ సరసన త్రిష, సిమ్రన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన తెలుగు ట్రైలర్ నేడు(బుధవారం) విడుదల అయింది. ‘20 మందిని పంపించాను.. అందరినీ చితక్కొట్టి తరిమాడు..’ అనే వాయిస్ ఓవర్‌తో ట్రైలర్ స్టార్ట్ అవుతుంది. ‘వాడు కూర్చునే తీరును బట్టే పసిగట్టగలం.. వాడు భయపడేవాడా? కాదా? అని.. వాడు మామూలోడు కాదు’ అంటూ రజినీ క్యారెక్టర్‌ని వర్ణిస్తూ చెప్పే డైలాగ్ ఆసక్తికరంగా ఉంది. ‘చూస్తావుగా ఈ కాళీ ఆడించే ఆట’ అంటూ రజినీ చెప్పే డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి. రజినీ స్టైల్‌ని ఈ చిత్రంలో బాగా యూజ్ చేసుకున్నారు డైరెక్టర్. మనం ఏం చేయబోతున్నామంటూ కంగారుగా ప్రశ్నిస్తే.. స్వీట్ తినబోతున్నామంటూ కూల్‌గా రజినీ చేసే కామెడీ సినిమాకే హైలైట్ అని చెప్పవచ్చు. విజయ్ సేతుపతి, నవాజుద్దీన్ సిద్ధిఖీ, శశి కుమార్, బాబీ సింహ తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రం ఈ నెల 10న ప్రేక్షకుల ముందుకు రానుంది.