‘RRR’ పూర్తి పేరు ఇదే… వైరల్ అవుతోన్న వార్త!
Spread the love

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ క్రేజీ కాంబినేషన్లో దర్శక ధీరుడు రాజమౌళి తెరక్కించబోతున్న భారీ చిత్రం ‘RRR’. ఇది కేవలం వర్కింగ్ టైటిల్ మాత్రమే. ఎన్టీఆర్, రామ్ చరణ్, రాజమౌళి పేర్లలోని మూడు Rలను తీసుకొని ఈ టైటిల్‌ను ప్రచారం చేశారు. అయితే ఈ సినిమా అసలు టైటిల్‌  ‘RRR’లోనే దాగి ఉందనే వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘RRR’ చిత్రాన్ని ఆదివారం హైదరాబాద్‌లో లాంఛనంగా ప్రారంభించారు. మెగాస్టార్ చిరంజీవి, రాఘవేంద్ర రావు ముఖ్య అతిథులుగా ఈ వేడుక హాజరయ్యారు. ఎన్టీఆర్, చరణ్ తో పాటు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, రానా కూడా హాజరయ్యారు. ఈ వేడుక సందర్భంగా టైటిల్‌పై చర్చ మొదలైంది. ‘RRR’ అంటే ‘రామ రావణ రాజ్యం’ అని సోషల్ మీడియాలో ప్రచారం మొదలైంది. కానీ, ఈ టైటిల్‌ను చిత్ర యూనిట్ ఇంకా ఖరారు చేయలేదు. మెగాస్టార్ చిరంజీవి తొలి క్లాప్‌ను ఇచ్చారు. దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు స్క్రిప్టును రాజమౌళి, ఎన్టీఆర్, చరణ్, నిర్మాత దానయ్యకు అందజేశారు. వారిపై అక్షింతలు జల్లి ఆశీర్వదించారు. సినీ పరిశ్రమకు చెందిన హేమాహేమీలు అల్లు అరవింద్, సురేష్ బాబు, శ్యామ్ ప్రసాద్‌రెడ్డి, వి.వి.వినాయక్, కొరటాల శివ, ప్రభాస్, దగ్గుబాటి రానా తదితరులు పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు.