లోక్‌సభ ఎన్నికల్లో ప్రకాశ్‌రాజ్‌
Spread the love

లోక్‌సభ ఎన్నికల్లో బెంగళూరు సెంట్రల్‌ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగనున్నట్లు ప్రముఖ నటుడు ప్రకాశ్‌రాజ్‌ ప్రకటించారు. స్వతంత్ర అభ్యర్తిగానే పోటీచేస్తానని, రాజకీయ పార్టీని స్థాపించే ఉద్దేశం లేదని చెప్పారు.‌ ఏ రాజకీయ పార్టీతోనూ చేతులు కలపనని ప్రముఖ నటుడు ప్రకాశ్‌రాజ్ స్పష్టం చేశారు.ప్రజల వ్యక్తిగా వారి సమస్యల్ని పరిష్కరించేందుకు కృషి చేస్తానని తెలిపారు. ఎన్నికల సమయంలో ఏ పార్టీకి వ్యతిరేకంగా ఉండాలో తెలుసని, కానీ ఏ పార్టీకి మద్దతు ఇవ్వనని అన్నారు.

బీజేపీ పార్టీ అనేది నీతిలేని వ్యక్తులతో కూడిన సమూహమని ప్రకాశ్‌రాజ్‌ విమర్శించారు. వారు గోమాతను పూజిస్తామని చెప్పుకొంటారని, కానీ గోవుల్ని పూజిస్తూ జరుపుకొనే మకర సంక్రాంతి రోజున మాత్రం ఇళ్లల్లో ఉండకుండా క్యాంప్‌లకు పోతారని ఎద్దేవా చేశారు.బెంగళూరులో తన బాల్యం గడిచిందని, అందుకే అక్కడి నుంచి పోటీ చేయాలని నిర్ణయించుకున్నానని తెలిపారు.బెంగళూరులోని మార్థాస్‌ ఆస్పత్రిలో జన్మించానని, చామరాజపేట, శాంతినగరలలో కొన్నాళ్లు నివాసం ఉన్నానని చెప్పారు.