‘RRR’ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా ప్రభాస్‌?
Spread the love

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌లతో దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి పవర్‌ఫుల్ మల్టీస్టారర్‌ను తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. గత కొద్దికాలంగా తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారిన ఈ కాంబినేషన్ (RRR) మొత్తానికి పట్టాలెక్కుతోంది. ఈ మల్టీస్టారర్‌ను నవంబర్ 11న లాంఛనంగా ప్రారంభించనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. 11వ తేదీన ఉదయం 11 గంటలకు పూజా కార్యక్రమంతో ఈ సినిమాను ప్రారంభించనున్నారు. డీవీవీ ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ మూవీ ఓపెనింగ్‌కు ప్రత్యేక అతిథిగా ఎవరు వస్తున్నారనే వార్త ఇప్పుడు సినీ పరిశ్రమలో వినిపిస్తోంది. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా రాజమౌళి బెస్ట్ ఫ్రెండ్, యంగ్‌ రెబెల్‌స్టార్‌ ప్రభాస్‌ రాబోతున్నట్లు టాలీవుడ్‌ వర్గాల సమాచారం. ఇందులో తారక్‌, రామ్‌చరణ్‌ బాక్సర్లుగా కన్పించనున్నారట. రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్‌ ఈ చిత్రానికి కథ రాశారు. ఇందులో తారక్‌, రామ్‌చరణ్‌కు జోడీగా ఎవరు నటించనున్నారన్నది తెలియాల్సి ఉంది.