పేటీఎం మహా కాష్ బ్యాక్ ఆఫర్ : ఐ ఫోన్లపై భారీ క్యాష్‌బ్యాక్‌
Spread the love

ఇప్పుడు మీరు ఐ ఫోన్ కొనాలి అనుకుంటున్నారా ? ఐ ఫోన్‌ కావాలని కలలు కంటున్నారా? అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ సేల్‌ మిస్‌ అయ్యారా? అయితే దసరా పండుగ సందర్భంగా పేటీఎం మాల్‌ పలు ఉత్పత్తులపై భారీగా క్యాష్‌బ్యాక్‌ ఆఫర్‌ ఇస్తోంది. ఒకవైపు ఫ్లిప్‌కార్ట్‌, అమెజాన్‌ ఫెస్టివ్‌ సేల్‌ ఆదివారంతో ముగిసిపోవడంతో పే టీఎం మాల్‌ ఆఫర్లతో వినియోగదారులను ఆకట్టుకుంటోంది.

నేటి నుంచి (అక్టోబర్ 16) ఈ నెల 18 వరకు పేటీఎం మాల్‌ మరోసారి ప్రత్యేక సేల్‌ నిర్వహిస్తోంది. ఈ సేల్ లో అనేక ఉత్పత్తులపై క్యాష్‌బ్యాక్‌ను అందిస్తోంది. తాజా ఐ ఫోన్లపై మహా క్యాష్‌బ్యాక్‌ ఆఫర్లు, ఎక్స్ఛేంజ్ ఆఫర్లను ప్రకటించింది. ముఖ్యంగా ఆపిల్ ఐఫోన్ ఎక్స్‌ 256జీబీ స్మార్ట్‌ఫోన్‌పై భారీగా 20వేల రూపాయల క్యాష్ బ్యాక్ ఉంది. ఇప్పటికే ఈ ఫోన్‌ మార్కెట్ ధర రూ. 1,05,720తో పోలిస్తే. రూ .3830 డిస్కౌంట్‌ ఆఫర్‌తో 1,01,890 రూపాయల వద్ద పేటీఎం మాల్‌ విక్రయించింది. దీనికి ప్రస్తుత క్యాష్‌బ్యాక్‌ అదనం. 64 జీబీ ఐఫోన్ ఎక్స్‌పై రూ. 3502 తగ్గింపు లభిస్తుంది. అంటే మార్కెట్‌ ధర రూ. 95,390 నుంచి తగ్గి 91,888 రూపాయలకు లభ్యం. అలాగే రూ. 22వేల దాకా క్యాష్‌ బ్యాక్‌ ఆఫర్‌ కూడా ఉంది. అయితే ఈ ఆఫర్ పొందేందుకు MOBFESTIVE18K ప్రోమో కోడ్‌ను ఉపయోగించాలి. అంతేకాదు ఐ ఫోన్‌ ఎక్స్‌ఎస్‌ కొనుగోలుపై భారీ డిస్కౌంట్ ఉంది. IPH5000 ప్రోమో కోడ్‌ ద్వారా 64జీబీ ఐఫోన్‌ కొనుగోలుపై 5వేల దాకా క్యాష్‌ బ్యాక్‌ ఉంది. 256 జీబీ స్మార్ట్‌ఫోన్‌ లో 12వేల క్యాష్‌ బ్యాక్‌ ఆఫర్‌. దీనికి ప్రోమో కోడ్ MOBFESTIVE12K. వీటితోపాటు 64జీబీ ఐఫోన్ 8 ప్లస్‌పై 13వేల రూపాయల క్యాష్‌ బ్యాక్‌ ఆఫర్‌. ప్రోమో కోడ్ MOBFESTIVE13K.. 256జీబీ ఐఫోన్ 8 కొనుగోలుపై 13500 క్యాష్ బాక్ ఉంది. ప్రోమో కోడ్MOBFESTIVE13500. 32జీబీ , 128జీబీ ఐఫోన్ 7 వరుసగా 4500, 8500 రూపాయల క్యాష్ బ్యాక్ ఆఫర్ .ప్రోమో కోడ్ MALLFESTIVE8500.32జీబీ ఐఫోన్ 6ఎస్‌ లో రూ. 3500 వరకు క్యాష్ బ్యాక్ అందిస్తోంది. చివరగా, 32జీబీ ఐఫోన్ 6 వేరియంట్ 6000 క్యాష్ బ్యాక్ ఆఫర్‌ చేస్తోంది. ప్రోమోకోడ్‌ ద్వారానే ఈ క్యాష్‌ బ్యాక్‌ ఆఫర్‌ చేస్తుంది. ప్రోమోకోడ్‌ ద్వారా ఆఫర్‌ చేస్తున్న నగదును ఫోన్లను డెలివరీ చేసిన 24గంటల్లోపు కస‍్టమర్ల ఖాతాలో క్రెడిట్‌ చేస్తామని కంపెనీ తెలిపింది.

దీంతోపాటు దుస్తులపై గరిష్టంగా 70శాతంరాయితీని ప్రకటించింది. కంప్యూటర్ ఉత్పత్తులపై 25శాతం క్యాష్‌ బ్యాక్‌ను, గేమింగ్ కన్సోల్స్‌పై రూ.6వేల క్యాష్‌బ్యాక్‌ ఆఫర్‌. అలాగే గృహోపకరణాలపై 60శాతం వరకు డిస్కౌంట్ లభిస్తోంది. దీంతోపాటు ల్యాప్‌టాప్‌లు, హెడ్‌ఫోన్లు, మొబైల్ యాక్ససరీస్‌పై కూడా ఆకట్టుకునే ఆఫర్లతో ముందుకు వచ్చింది .