ఇంటర్నేషనల్ డాన్స్ షో లో పవన్ పాట
Spread the love

పవన్ కళ్యాణ్ పాటలకు ఎంత క్రేజ్ ఉన్నదో తెలుగు ప్రేక్షకులకు తెలియంది కాదు. పవన్ సినిమా ఫ్లాప్ అయినా సందర్భాలున్నాయి, ఆడియో ఫ్లాప్ అయిన సందర్భాలు లేవంటారు గేయ రచయితలు. ఇప్పడు పవన్ పాట అంతర్జాతీయ వేదికపై అదరగొట్టింది. వేలమంది నిలిచినా పోటీలో విజేతలుగా నిలిపింది. న్యాయనిర్ణేతలు ఆశ్చర్యానికి గురి చేసింది. ప్రపంచంలోని డాన్స్ రియాల్టీ షోల్లో వరల్డ్ అఫ్ డాన్స్ షో ప్రఖ్యాతి గాంచింది.

ఈ షోలో జడ్జీలుగా ప్రపంచాన్ని ఓ ఊపు ఊపేసిన జెన్నిఫర్ లోపెజ్, నియో వ్యవహరిస్తున్నారు. 2015 లో మొదలైన ఈ షో మూడో సీజన్ ను ముంబైకి చెందిన ది కింగ్స్ హిప్ హాఫ్ డాన్స్ గ్రూప్ గెలుచుకుంది. అయితే అంతర్జాతీయ వేదికపై ఆ టీమ్ పవన్ సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాలోం వాడేవాడన్నా…వీడెవడన్నా పాటకు డాన్స్ వేశారు. వారి డాన్స్ కి జడ్జీలు ముగ్ధులయ్యారు. వారినే విజేతలుగా ప్రకటించారు.