జనసేన ఎదుగుదలను ఎవరూ ఆపలేరు : పవన్ కల్యాణ్
Spread the love

పవన్ కల్యాణ్ చేపట్టిన ప్రజాపోరాటయాత్ర పశ్చిమగోదావరి జిల్లా దేవరపల్లికి చేరుకుంది. ఈసందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ… ప్రజాస్వామ్యం టీడీపీ సొత్తా అని ఆయన ప్రశ్నించారు. నేను టీడీపీకి మద్దతిచ్చింది ఇసుక మాఫియా చేసి దోచుకుంటారని కాదని అన్నారు. రాజకీయాలు టీడీపీ పార్టీకే పరిమితమవ్వాలా అని ప్రశ్నించారు. జనసైనికులపై దాడులు చేస్తే ఊరుకోమన్నారు. కోట్లు సంపాదించుకునేందుకు రాజకీయాల్లోకి రాలేదన్నారు. జనసేన ఎదుగుదలను ఎవరూ ఆపలేరని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. పారిశ్రామికవేత్తలపై ఐటీ దాడులు చేస్తే ముఖ్యమంత్రి ఎందుకు ఉలికిపడుతున్నారని ప్రశ్నించారు. దీనివల్ల వచ్చే ఎన్నికల కోసం వారి వద్ద ఆయన సొమ్మును దాచుకుని ఉంటారనే అనుమానం కలుగుతోందన్నారు. జనసైనికులకు చెందిన 18లక్షల మంది ఓట్లను రాష్ట్రంలో తొలగించేశారని పవన్‌ ఆరోపించారు. జనసైనికులంతా తమ ఓటును మళ్లీ నమోదు చేసుకోవాలని సూచించారు. 2019 ఎన్నికలు చాలా కీలకమైనవని పవన్‌ పేర్కొన్నారు. 2014 ఎన్నికల హామీలను ఎందుకు అమలు చేయలేకపోయారో ముఖ్యమంత్రి చెప్పాలని డిమాండు చేశారు.