దశావతార వేంకటేశ్వర ఆలయానికి పవన్ భారీ విరాళం
Spread the love

ఆలయానికి చేరుకున్న పవన్‌కళ్యాణ్‌కు ఆలయ ధర్మకర్తలు లింగమనేని పూర్ణభాస్కరరావు, వెంకటసూర్య రాజశేఖర్, రమేశ్ వేద మంత్రోచ్ఛరణల మధ్య స్వాగతం పలికారు. ఈ సందర్భంగా స్వామి, అమ్మవార్లకు పవన్ ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఎన్నికల ప్రక్రియ ముగియడంతో ఆంధ్రప్రదేశ్‌లో నేతలంగా సైలెంట్ అయిపోయారు. నెలరోజుల పాటు అలుపెరుగకుండా రాష్ట్రమంతా ప్రచారం చేసిన అగ్రనేతలు ఇప్పుడు విశ్రాంతి తీసుకుంటున్నారు. ప్రజల తీర్పు ఈవీఎంలలో నిక్షిప్తం కావడంతో ఇక ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు. జనసేన పార్టీకి అన్నీ తానై నిలిచిన పవన్‌కళ్యాణ్ ఇప్పుడు ఆలయాల బాట పట్టారు. ఎన్నికలు ముగిసిన మరుసటి రోజు ఆయన గుంటూరు జిల్లాలోని దశావతార వేంకటేశ్వర ఆలయాన్ని సందర్శించారు.

ఆలయానికి చేరుకున్న పవన్‌కళ్యాణ్‌కు ఆలయ ధర్మకర్తలు లింగమనేని పూర్ణభాస్కరరావు, వెంకటసూర్య రాజశేఖర్, రమేశ్ వేద మంత్రోచ్ఛరణల మధ్య స్వాగతం పలికారు. ఈ సందర్భంగా స్వామి, అమ్మవార్లకు పవన్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పవన్‌కళ్యాణ్ ఆలయానికి రూ.1.32కోట్ల విరాళాన్ని చెక్కు రూపంలో అందజేశారు. ఈ మొత్తాన్ని స్వామివారి నిత్య అన్నదానానికి వినియోగించాలని కోరారు.