రెండు భాగాలుగా ‘యన్‌.టి.ఆర్‌’ బయోపిక్…. రిలీజ్ డేట్ ఫిక్స్!
Spread the love

దివంగత నందమూరి తారకరామారావు జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘యన్.టి.ఆర్’. బాలకృష్ణ హీరోగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు క్రిష్ దర్శకుడు. విద్యాబాలన్‌ ఎన్టీఆర్‌ సతీమణి బసవ తారకం పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో రానా, సుమంత్‌, సత్యనారాయణలు ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను రెండు భాగాలుగా రిలీజ్‌ చేసే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. తొలి భాగంలో ఎన్టీఆర్‌ సినీ జీవితం రెండో భాగంలో ఎన్టీఆర్ రాజకీయ ప్రస్థానం తెరకెక్కించనున్నారు. తాజాగా రిలీజ్‌ అయిన పోస్టర్‌లో ‘యన్‌.టి.ఆర్‌’ టైటిల్‌తో పాటు కథానాయకుడు అనే ట్యాగ్‌ను జత చేసారు.

బాలయ్యబాబు టైటిల్ రోల్ పోషిస్తున్న ఈ సినిమాను సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 9న విడుదల చేయనున్నామని డైరెక్టర్ క్రిష్ తెలిపాడు. ‘ప్రతి కథకీ ఓ నాయకుడుంటాడు.. కానీ కథగా మారే నాయకుడొక్కడే వుంటాడు.. జనవరి 9న యన్.టి.ఆర్ కథనాయకుడు’ వస్తున్నాడని క్రిష్ ట్వీట్ చేశాడు.