ప్రియురాలితో ఫుల్ రొమాన్స్ చేస్తున్న ‘నోటా’ డైరెక్టర్
Spread the love

విజయ్ దేవరకొండతో ‘నోటా’ చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు ఆనంద్ శంకర్. తమిళ సినీ ఇండస్ట్రీకి చెందిన ఈ దర్శకుడు నోటా చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు. నోటాతో పెద్దగా ఆకట్టుకోలేక పోయిన ఆనంద్ శంకర్ లో మ్యాటర్ ఉందని మాత్రం అనిపించుకున్నాడు. తెలుగులో ఈయనతో సినిమాలు చేసేందుకు హీరోలు – నిర్మించేందుకు నిర్మాతలు ఆసక్తిని కనబర్చుతున్నారు. ప్రస్తుతం ఈ దర్శకుడు దీపావళిని ఫుల్ గా లవ్ అండ్ రొమాంటిక్ మూడ్ తో ఎంజాయ్ చేస్తున్నాడు. ఆయన లవ్ ప్రపోజల్‌కి ప్రియురాలు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చేసింది. దీంతో ఆమెతో కలిసి దుబాయ్‌లో చెట్టాపట్టాలేసుకొని ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ విషయాన్ని ట్విట్టర్‌ ద్వారా అభిమానులతో షేర్ చేశాడు. తన ప్రైవేట్ లైఫ్ గురించి ఇది ఫస్ట్ పోస్ట్ అని, తానెప్పుడూ సొంత విషయాల గురించి బయటకు చెప్పలేదని, కానీ ఈ పరిస్థితుల్లో సంతోషాన్ని పంచుకోలేక ఉండలేకపోతున్నాను.. మా ప్రేమకు మీ ఆశీర్వచనాలు కావాలంటూ ట్వీట్ చేశాడు. విలాసవంతమైన కారులో తిరుగుతూ, ముద్దులు పెట్టుకొంటున్న పిక్స్‌ని సోషల్‌మీడియాలో పోస్ట్ చేశాడు.