అద్భుతం : ఇద్దరు అమ్మాయిలకు మగబిడ్డ పుట్టాడు!
Spread the love

సాధారణంగా ఒక బిడ్డకు జన్మనివ్వాలంటే స్త్రీ, పురుషుల సంపర్కం జరగడం తప్పనిసరి. అసహజ శృంగారానికి పాల్పడే గే, లెస్బియన్‌ వంటి స్వలింగ సంపర్కులకు పిల్లలు పుట్టే అవకాశం ఉండదు. అది అసాధ్యం కూడా! .. అయితే అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తూ ఓ ‘లెస్బియన్’ జంట పండంటి మగ బిడ్డకు జన్మినిచ్చి ప్రపంచాన్నే ఔరా అనిపించింది. ఈ అరుదైన సంఘటన అమెరికాలోని నార్త్ టెక్సాస్‌లో చోటుచేసుకుంది. మౌంటైన్ స్ప్రింగ్స్‌కు చెందిన బ్లిస్ కౌల్టర్(36), అష్లేయిగ్ (28) అనే ఇద్దరు అమ్మాయిలు కొన్నేళ్లుగా సహజీవనం చేస్తున్నారు. మూడేళ్ల క్రితం అంటే 2015లో వారు వివాహం కూడా చేసుకున్నారు. ఇద్దరూ స్వలింగ సంపర్కులే కావడంతో పిల్లలు కనడం అసాధ్యం. అయితే బ్లిస్ కౌల్టర్ పిల్లలు కావాలని ఆశపడింది. అయితే ఆమెకు పురుషుడి ద్వారా గర్భం దాల్చడం ఇష్టం లేదు. తన భాగస్వామి అష్లేయిగ్ ద్వారానే పిల్లలు కావాలని పట్టుబట్టింది.

తమకు పుట్టబోయే బిడ్డ భౌతికంగా తమ ఇద్దరికీ చెందినదై ఉండాలని బ్లిస్ కోరుకుంది. ఇద్దరూ కలిసి వైద్యులను సంప్రదించి, తమ కోరికను వివరించారు. వారి కోరికను విన్న డాక్టర్లు ఆశ్చర్యపోయారు. కానీ పిల్లలు పుట్టే అవకాశం మాత్రం ఉంటుందని డాక్టర్లు వారికి చెప్పారు. దాంతో బ్లిస్ కౌల్టర్, అష్లే ఇద్దరు అమ్మాయిల నుంచి శుక్రకణాలను సేకరించారు. ఓ పురుషుడి వీర్యకణాలతో జత చేసి ఫలదీకరణం చేసి అండాన్ని రూపొందించారు. ఈ పిండాన్ని బ్లిస్ గర్బాశయంలో ఐదు రోజుల పాటు ఉంచి, తర్వాత అష్లేయిగ్‌ గర్భశయంలో ప్రవేశపెట్టారు. దీంతో అష్టేయిగ్ గర్భందాల్చి.. పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఆ బిడ్డకు స్టేట్సాన్ అని పేరు పెట్టారు. ఈ విధానంలో బిడ్డను పుట్టించేందుకు 8,500 డాలర్లు (భారత కరెన్సీలో రూ.6,25,430) ఖర్చయ్యాయి. మొత్తానికి బ్లిస్ నుంచి తీసిన అండం.. ఫలదీకరణ తర్వాత అష్లేయిగ్ గర్భశయంలో బిడ్డగా ఎదిగి ఇద్దరికీ మాతృత్వ ఆనందాన్ని ఇవ్వడం నిజంగా అద్భుతమే!!. డాక్టర్లు అరుదైన ప్రయోగం ద్వారా దీనిని సాధించారు.