ఈ నెల 29 తర్వాత టీవీ ఛానెల్స్ ఆగిపోవు…
Spread the love

ఈ నెల 29వ తేదీ నుంచి కొత్త నిబంధనలు వచ్చేస్తున్నాయి కనుక టీవీ ప్రసారాలు నిలిచిపోనున్నాయి… సాధ్యమైన తొందర ఇష్టమైన ప్యాకేజీని ఎంచుకుంటేనే మీరు యథావిథిగా కేబుల్ ప్రసారాలు చూసేందుకు విలుంటుంది. లాంటి మాటలు వినపడుతున్నాయి… అయితే కొత్త విధివిధానాల అమలు కారణంగా టీవీ సేవల్లో ఎలాంటి అంతరాయం ఉండకూడదని స్పష్టం చేసింది భారత టెలికం నియంత్రన ప్రాధికార సంస్థ (ట్రాయ్). కేబుల్‌ టీవీ ప్రసారాలకు సంబంధించిన కొత్త నియంత్రణ విధివిధానాల అమలు నేపథ్యంలో చందా చెల్లించిన ఛానళ్లను నిలిపివేయడం జరగదని తెలిపింది. తమ ఆదేశాల అమలు వల్ల టెలివిజన్‌ సేవల్లో అంతరాయం ఉండబోదంటూ ప్రకటించింది ట్రాయ్. గత ఏడాది మార్చిలో ట్రాయ్‌ ప్రసార, కేబుల్‌ సేవలకు కొత్త నియంత్రణ విధివిధానాలను జారీ చేయగా… ఈ ఏడాది జులై 3న వాటిని తిరిగి జారీ చేస్తూ.. అమలు చేసేందుకు షెడ్యూలును నిర్దేశించింది.

ఈనెల 29వ తేదీ నుంచి కొత్త ఆదేశాల అమలుతో ప్రస్తుతం చందా చెల్లించిన ఛానళ్ల ప్రసారాలు నిలిచిపోతాయనే వార్తలు ప్రచారంలో ఉన్నట్లు తాము గుర్తించామని, ప్రస్తుతం వినియోగదారులు వీక్షిస్తున్న ఏ ఛానల్‌ కూడా 29వ తేదీ తర్వాత నిలిచిపోకుండా అన్ని ప్రసార సంస్థలు, పంపిణీ ఆపరేటర్లు, స్థానిక కేబుల్‌ ఆపరేటర్లు తగిన చర్యలు తీసుకోవాలని ట్రాయ్‌ ప్రకటించింది. కేబుల్‌ కొత్త నిబంధనలు అమలులోనికి రానున్న నేపథ్యంలో ఇకపై ఎంపిక చేసుకొన్న ఛానెల్స్ కి మాత్రమే డబ్బు చెల్లించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఏయే టీవీ ఛానెల్స్ ఎంత రేటు ? అన్నది టీవీ ఛానెల్స్, వార్త పత్రికల ద్వారా కొన్నాళ్లుగా ప్రచారం చేస్తున్నారు. తెలుగు ఛానెల్స్ ప్యాకేజ్ ఎంచుకొంటే రూ. 283 చెల్లించాల్సి ఉంటుంది.