మరో కొత్త డిజిటల్ పేమెంట్స్ యాప్
Spread the love

 

డిజిటల్పేమెంట్దిగ్గజం పేటీఎంకు పోటీగా ట్రూకాలర్వచ్చేసింది. పేమెంట్స్యాప్చిల్లర్ను ట్రూకాలర్కొనుగోలు చేసింది. చిల్లర్యాప్కొనుగోలుతో ట్రూకాలర్కేవలం పేటీఎంకు మాత్రమే కాక, వాట్సాప్పేమెంట్స్సర్వీసులను భారత్లో ధీటుగా ఎదుర్కోబోతుంది. గతేడాది డిజిటల్పేమెంట్సెగ్మెంట్లోకి ట్రూకాలర్ప్రవేశించిన అనంతరం భారత్లో కంపెనీ చేపట్టిన తొలి కొనుగోలు ఇదే కావడం విశేషం. దీంతో స్వీడన్కు చెందిన కంపెనీ ప్రస్తుతం యూపీఐ ఆధారిత ట్రాన్సఫర్లను తన యాప్లో అనుమతించనుంది. ట్రూకాలర్పే 2.0 లాంచ్తో తన యాప్లో బ్యాంకింగ్‌, పేమెంట్స్ఫీచర్ను తీసుకొచ్చింది

వచ్చే నెలల్లో క్రెడిట్‌, ఇతర ఫైనాన్సియల్సర్వీసులను అందించాలని కూడా  ట్రూకాలర్ప్లాన్చేస్తోంది.  చిల్లర్వ్యవస్థాపకులు సోనీ జాయ్‌, అనూప్సర్కార్‌, మహ్మద్గలీబ్‌, లిషోయ్భాస్కరన్లతో పాటు ఆర్గనైజేషన్లో మిగతా ఉద్యోగులు ట్రూకాలర్లో చేరబోతున్నారు. సోనీ జాయ్ట్రూకాలర్పే సంస్థకు వైస్ప్రెసిడెంట్గా వ్యవహరించనున్నారు. చిల్లర్కొనుగోలుతో, తాము మొబైల్చెల్లింపులకు ఎంతో నిబద్ధతను కలిగి ఉన్నామని పునరుద్ఘాటిస్తున్నామని, యూజర్బేస్ను తాము బలపరుచుకోనున్నామని ట్రూకాలర్సహ వ్యవస్థాపకుడు, చీఫ్స్ట్రాటజీ ఆఫీసర్నామి జరింఘలం అన్నారు. గతేడాది నుంచి చిల్లర్తన యాప్ను విక్రయించడానికి చూస్తోంది. హెచ్డీఎఫ్సీ బ్యాంకు చిల్లర్కు అతిపెద్ద భాగస్వామి.