విమానంలో సైకో  పని..రన్ వేపై నిలిచిన విమానం !!
Spread the love

ఎక్కడ ఎప్పుడు ఎలా ప్రవర్తించాలో తెలియకపోతే లేనిపోని చిక్కులు తప్పవు అనడానికి ఇదో ఉదాహారణ . సరదా అనే అంశానికి ఎంత పరిమితి ఉంటుందో తెలియని ఒక వ్యక్తి చేసిన పని ఇప్పుడు అందరిలోను కలకలం రేపింది. కలకత్తా నుంచి ముంబై వెళ్తున్న జెట్ విమానం ఎక్కిన పోద్దార్ అనే ప్రయాణికుడు ఈ జ్ఞానం లేకుండా వ్యవహరించి ఇబ్బంది కలిగిచారు. విమానం – టెర్రరిస్టులు అనే మాటలు కలిపివాడితే జనం కంగారు పడిపోవడం ఖాయం. విమానం ఎక్కీఎక్కగానే పోద్దార్ ముఖానికి కర్చీఫ్ కట్టుకుని ఫోన్ లో నేను మహిళల హృదయాలు కొల్లగొట్టే టెర్రరిస్టును.. అంటూ ఏవేవో మెసేజ్ లు పంపడం మొదలుపెట్టాడు. ఇక్కడే అసలు ట్విస్ట్ చోటుచేసుకుంది.

పోద్దార్ సీట్లో కూర్చున్న సమయంలో అతడి వాలకం చూసి పక్క సీట్లో ఉన్న ప్రయాణికుడు బెదిరిపోయాడు. ఇంక మెసేజ్ లలోకి తొంగి చూసి టెర్రరిస్టు అనే మాటలు కనిపించేసరికి ఠారెత్తిపోయాడు. ఆ ముసుగు ఏమిటి – ఆ మెసేజ్ లు ఏమిటి? అని కంగారుపడిపోయాడు. వెంటనే లేచి పైలట్ ను అప్రమత్తం చేశాడు. దాంతో విమాన సిబ్బంది భద్రతాధికారులను పిలిపించారు. వారు విమానం నుంచి అతడిని దింపేశారు. అతడి లగేజీని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఈ ఘటన కారణంగా విమానం గంట లేటైంది. పోద్దార్ దీని గురించి చెప్పుతూ నేను జోక్ చేశాను మొర్రో అని ఎంత మొత్తుకుంటున్నా భద్రతాధికారులు వినలేదు. యోగి చేసిన ఆకతాయి పని వల్ల విమానాన్ని అత్యవసరంగా నిలిపివేయాల్సి వచ్చిందని ఎయిర్ పోర్టు అధికారి తెలిపారు. ప్రయాణికుల భద్రతకు సంబంధించిన ఏ విషయాన్ని తేలికగా తీసుకోలేమని ఈ కారణంగానే విమానం గంట ఆలస్యంగా బయల్దేరిందని పేర్కొన్నారు. అతడిని కోల్ కతా పోలీసులకు అప్పగించారు. ప్రస్తుతం వారు దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తుంది.