ముకేష్ అంబానీ కూతురి వివాహ ఖర్చు ఎంతో తెలుసా?
Spread the love

భారతదేశంలో జరిగిన అత్యంత ఖరీదైన వివాహ వేడుకల్లో ఒకటిగా నిలిచిపోయేలా రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ, నీతా అంబానీల కుమార్తె ఈశా అంబానీ వివాహం ఆనంద్ పిరామల్ తో జరిగింది.ఈ వేడుక లో తన కూతురిని పెళ్లి కూతురిగా చూసినప్పుడు ముఖేష్ అంబానీ కళ్లు ఆనందబాష్పాలతో నిండిపోయాయి.ఈ పెళ్లి వేడుకకు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాల్ చల్ చేస్తున్నాయి.

ఈ వివాహం ముకేష్ అంబానీ నివాసమైన యాంటీలియాలో అంగరంగ వైభవంగా జరగనుంది.ఈ వివాహం దేశంలో హాట్ టాపిక్‌గా మారింది అందుకు కారణం 718 కోట్ల పెళ్లి ఖర్చు.ఈ వార్త నిజమైతే ఈ వివాహం ప్రపంచంలో జరగబోయే రెండోవ ఖరీదైన వివాహ అవుతుంది.మొదటిది యువరాజు చార్లెస్, డయానాల వివాహం.