ఈ ఫోన్ ప్రత్యేకంగా సీనియర్ల కోసమే….!
Spread the love

 

సీనియర్‌  సిటిజన్లకోసం ఒక సులభతరమైన  ఒక మొబైల్ను  విడుదల చేసిందో కంపెనీ. సీనియర్ వరల్డ్  అనే కంపనీఈజీ ఫోన్గ్రాండ్‌’ పేరుతో ఒక  ఫీచర్ఫోన్ను లాంచ్చేసింది. అదీ బడ్జెట్ధరలోనే. తద్వారా  ఫీచర్ ఫోన్లన్నీ కేవలం  యూత్కోసమే కాదుసీనియర్ సిటిజన్లకోసం కూడా అన్న సందేశాన్నిస్తోందివారు సౌలభ్యంగా వినియోగించుకునేందుకు వీలుగా చాలాఈజీగా రూపొందించామని  కంపెనీ చెప్పింది. భారత దేశంలో  తరహా ఫోన్లాంచ్చేయడం ఇదే మొదటిసారని కంపెనీ చెబుతోంది. వినికిడి సమస్య ఉన్న వారుహియరింగ్సాధనాలు  పెట్టుకోవడానికి ఇష్టపడని వారికి  తమ ఫోన్మంచి పరిష్కారమంటోందిస్పెషల్టెక్నాలజీ, స్పెషల్‌  ఇయర్ఫోన్స్‌  డివైస్ప్రత్యేకత అని కంపెనీ పేర్కొంది. సరసమైన దరలో  కేవలం రూ. 3,990కే  ఈజీఫోన్ను కంపెనీ మార్కెట్లోకి ప్రవేశపెట్టింది.

సీనియర్లకు అవసరమయ్యే అన్ని రకాల ఫీచర్లతో ఫోన్ రూపొందించామని చెప్పింది. పెద్ద స్క్రీన్ , పెద్ద ఫాంట్ సైజ్, డయలింగ్ కీలు కూడా పెద్దవిగా, ఫోటో డయిల్, క్రాడిల్ చార్జర్ వంటి ఫీచర్లు ఫోన్లో ఉన్నాయని కంపెనీ  తెలిపింది.   సీనియర్ వరల్డ్.కామ్, అమెజాన్ ఇండియా, ఫ్లిప్ కార్ట్, ఈబే ఇండియా లలో ఫోన్ అందుబాటులో ఉంటుంది. నాలుగు ఆటోమేటెడ్ పనులను నిర్వహించేలా ఎస్ఓఎస్ బటన్తో  పాటు ఇంకా  ఐదు ఎమర్జెన్సీ కాంటాక్టులు, వాటికి కాల్స్, ఎస్ఎంఎస్ చేసుకునే సౌలభ్యం, ఇన్ కామింగ్ కాల్స్ లిస్ట్, కస్టమైసెబుల్ మెనూ ఫీచర్లను ఆటోమేటెడ్గా ఫోన్లో పొందుపరిచామని పేర్కొంది. సీనియర్సిటిజనుల  ప్రత్యేక అవసరాలకుకచ్చితంగా ఫోను ఉపయోగపడుతుందనే  విశ్వాసాన్ని కంపెనీ సీఈవో రాహుల్ గుప్తా వ్యక్తం చేశారు.