రష్మీ కారు ఢీకొని ఒకరికి తీవ్ర గాయాలు
Spread the love

అనకాపల్లిలో ఒక కార్యక్రమంలో పాల్గొని తిరిగి గాజువాకకు వస్తుండగా కూర్మన్నపాలెం డిపోకు సమీపంలో నటి, యాంకర్‌ రష్మీ ప్రయాణిస్తున్న కారు …రోడ్డు దాటుతున్న వ్యక్తిని ఢీకొట్టింది. ఈ సంఘటనలో ఆ వ్యక్తికీ తీవ్ర గాయాలయ్యాయి, అతను చిత్తూరు జిల్లా గుర్రంకొండకు చెందిన లారీ డ్రైవర్‌ సయ్యద్‌ అబ్దుల్‌ గా గుర్తించారు. అనంతరం అతడిని నగరంలోని ఓ ప్రయివేట్‌ ఆస్పత్రికి తరలించారు. ఇక సంఘటన సమయంలో రష్మీతో పాటు ఆమె తల్లి కూడా కారులో ప్రయాణం చేస్తున్నారు. హైదరాబాద్‌కు చెందిన కారు డ్రైవర్‌ ఎం.ఎ.గౌతమ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దువ్వాడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.