ప్రియురాలి ఇంటి ముందు విషం తాగి ఆత్మహత్య…
Spread the love

ప్రియురాలు తన వెంట రాకపోవడం విరక్తి చెంది చెన్నై కి చెందిన ఓక వ్యక్తి నాగర్‌కోయిల్‌లో తన ప్రియురాలి ఇంటి ముందే విషం తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.చెన్నై లోని ఆవడి తిరుముల్‌లై వాయిల్‌ SMనగర్‌కు చెందిన మురుగన్‌ అనే వ్యక్తి కి వివాహమై ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు.

మురుగన్ కు నాగర్‌కోయిల్‌ కు చెందిన మరొక మహిళతో ఆమె చెన్నైలో నివాసం ఉన్న సమయంలో వివాహేతర సంబంధం ఏర్పడింది.ఈ క్రమంలో ఆ మహిళ కుటుంబీకులకు ఆమె వివాహేతర సంబంధం గురించి తెలియడంతో ఆమెను సొంత ఊరైన నాగర్‌కోయిల్‌ తీసుకెళ్ళారు.దీంతో మురుగన్‌ కు  ఆ మహిళ దూరం కావడం తో ఆవేదన చెందాడు.

రెండు రోజుల కిందట మురుగన్‌ నాగర్‌ కోయిల్‌కు వెళ్లి ప్రియురాలిని జాడ తెలుసుకొని ఆ మహిళను తనతో రమ్మని పిలిచాడు.దానికి ఆమె తిరస్కరించడం తో విరక్తి చెందిన మురుగన్‌ ఆమె ఇంటి ముందే వెంట తెచుకున్న విషం తాగాడు.దాంతో స్పృహతప్పి పడిపోయిన అతన్ని స్థానికులు ఆచారి పల్లం ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు.ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అతను  మృతి చెందాడు…