కేటీఆర్‌ని క‌లిసిన మల‌యాళ సూపర్ స్టార్..!
Spread the love

మలయాళం సూపర్ స్టార్ మ‌మ్ముట్టి కొద్ది సేప‌టి క్రితం తెలంగాణ ఐటీ శాఖా మంత్రి కేటీఆర్‌ని సీఎం క్యాంప్ ఆఫీసులో కలిశారు. ఈ సందర్భంగా మమ్ముటీ ఈ నెల 25న హైదరాబాద్‌లో జరిగే ‘కైరాలి పీపుల్ ఇన్నోటెక్ అవార్డ్స్’ కార్యక్రమానికి కేటీఆర్‌ను ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. ఈ ఆహ్వానానికి కేటీఆర్ సానుకూలంగా స్పందించారు . ఇక మమ్ముట్టిని శాలువాతో స‌త్క‌రించిన కేటీఆర్ ఓ జ్ఞాపిక‌ని కూడా అందించారు. కేటీఆర్‌ని క‌ల‌వ‌డంపై మ‌మ్ముట్టి ఆనందం వ్య‌క్తం చేశారు. ఈ విషయాన్ని కేటీఆర్ తన ట్విట్టర్ ద్వారా తెలిపారు.

మమ్మూట్టి ప్రస్తుతం తెలుగులో మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి పాదయాత్ర నేపథ్యంలో తెరకెక్కుతున్న ‘యాత్ర’ చిత్రంలో వైఎస్సార్ పాత్ర పోషిస్తున్నారు.ఈ చిత్రానికి మహి వి రాఘవ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవలే వైఎస్సార్ జయంతి సందర్భంగా చిత్ర యూనిట్ టీజర్‌ విడుదల చేయగా.. వైఎస్సార్‌ పాత్రలో మమ్ముట్టి ఒదిగిపోవడంతో విశేష ప్రేక్షకాదరణ లభిస్తోంది. ఇక ఈ చిత్రంలో వైఎస్ విజయమ్మ పాత్ర కోసం బాహుబలి ఫేం ఆశ్రితని సెలక్ట్ చేసిన ద‌ర్శ‌కుడు, వైఎస్ పర్సనల్ అసిస్టెంట్ సూరీడు పాత్ర కోసం పోసాని కృష్ణ మురళి, షర్మిళ పాత్ర కోసం భూమిక, సబితా ఇంద్రా రెడ్డి పాత్ర కోసం సుహాసినిని సెలక్ట్ చేసినట్టు టాక్. ఈ సినిమాలో ప్రజా ప్రస్థానం పాదయాత్రను ముఖ్యంగా చూపించనున్నారని స‌మాచారం.